Prabhas: పెళ్లికి రెడీ అయిన తెలుగు హీరోయిన్.. వరుడు ఎవరో కాదు ప్రభాస్ ఫ్రెండే!
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు సర్వ సాధారణం. హీరోలు హీరోయిన్లతో ప్రేమలో పడడం, హీరోయిన్లు హీరోలతో ప్రేమలో పడడం ఎంత కామన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు పెళ్లి పీటలెక్కి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టగా మరికొద్ది గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరగనుంది.
ఈ ఇద్దరు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు అదికూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని పేర్కొనడం హాట్ టాపిక్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఎవరిని ప్రేమించి పెళ్లిచేసుకోబోతుంది అనేది చూద్దాం పదండి..

ఆ హీరోయిన్ మరెవరో కాదు తెలుగమ్మాయి శ్రీ దివ్య. ఈ తెలుగమ్మాయి హనుమాన్ జంక్షన్, వీడే, యువరాజు అనే సినిమాల్లో బాలనటిగా నటించి రవిబాబు డైరెక్షన్లో మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా మారుతి పరిచయం అయ్యింది. ఇక మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన బస్టాప్ అనే సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత సినిమాలో నటించగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిన శ్రీదివ్య అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తూ వస్తోంది. అక్కడ వరుస సినిమాలతో క్రేజ్ సొంతం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హాట్ టాపిక్ అయింది. శివకార్తికేయన్ సరసన హీరోయిన్ గా 'వరుత్తపడాద వాలిబర్ సంఘం' సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో అక్కడే వరుస సినిమాలు చేసింది శ్రీ దివ్య.

అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోన్న శ్రీ దివ్య.. 'కాక్కీ సట్టై', 'జీవా', 'ఈటీ', 'మరుదు', 'బెంగుళూర్ నాట్కల్', 'పెన్సిల్' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె తన ప్రేమ వ్యవహారం గురించి పెదవి విప్పింది. తాజాగా శ్రీదివ్య 'రైడ్' అనే సినిమాలో నటించగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదివ్యకు పెళ్లి పై ప్రశ్న ఎదురవగా ఆమె స్పందిస్తూ నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, అది కూడా ప్రేమ పెళ్లి అని చెప్పుకొచ్చారు. నేను ప్రేమించిన వ్యక్తితోనే త్వరలో నా పెళ్లి జరుగుతుందని వెల్లడించింది. అయితే శ్రీ దివ్య.. ప్రభాస్ స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట వైరల్ గా మారింది. ఆ వ్యక్తి ఓ ప్రోడ్యూసర్ అంట. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాలి.


Click it and Unblock the Notifications











