ప్రభాస్ అలా చీట్ చేస్తాడు.. రెబల్ స్టార్ గుట్టువిప్పిన యంగ్ హీరోయిన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా 'సలార్'తో మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. మరోవైపు హిందూ మైథాలాజీ అండ్ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 ఏడీ'తో బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటారు ప్రభాస్. ఇదిలా ఉంటే... ప్రభాస్ వ్యక్తిత్వం గురించి అందరికీ తెలిసిందే. ఆయనను ఇండస్ట్రీలో మెచ్చుకోని వారంటూ ఉండరు. ఒక్కరితో కూడా ప్రభాస్ ఇంత వరకుచిన్న మాట కూడా అనిపించుకోలేదు. అనలేదు. చాలా ఫేయిర్ బయోను మెయిటెయిన్ చేస్తూ వస్తున్నారు మన డార్లింగ్.
అయితే డార్లింగ్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా.. ఆయన ఫూడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే. ప్రభాస్ డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలను తింటూ ఉంటారు. అంతే కాదండోయ్ తన వద్దకు వచ్చిన వారికి మాత్రం పొట్ట పగిలిపోయేలా ఫుడ్ తినిపిస్తారు. అతిథులకు రాజమర్యాదాలు చేసి రుచికరమైన భోజనం అందించడం డార్లింగ్ ఉన్న మంచి అలవాటు. డార్లింగ్ కూడా ఎంతో ఇష్టం తింటూ ఉంటారని పలువురు సెలబ్రెటీలు పలు సమయాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా నటి శ్రీదేవి కూడా ప్రభాస్ ఫుడ్ హ్యాబిట్స్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది.

ప్రభాస్ చాలా ఫూడ్ లవర్ అని తెలిపింది నటి శ్రీదేవి. తన వద్దకు వచ్చిన అతిథులకు ఎంతో ప్రేమగా అన్ని రకాల వంటలు చేయించి వడ్డిస్తారని తెలిపింది. అసలు తనకే తెలియని వంటకాల పేర్లను ప్రభాస్ చెబుతుండటంతో ఆమె షాక్ అయ్యిందంట. శ్రీదేవి ఎక్కువగా బిర్యానీ తినేందుకు ఇష్టపడుతుందని తెలిపింది. డార్లింగ్ ప్రభాస్ కూడా హైదరాబాదీ బిర్యానీ ఎలా తింటారో తెలిసిందే. ఎంతో చక్కగా వంటకాల గురించి ప్రభాస్ చెప్పటం తనకు ఇంకా గుర్తుకు ఉందని తెలిపింది. అంతే కాదు ప్రభాస్ ఏదైనా ఒక వంటకం గురించి చెబితే వెంటనే వండేసి తినాలని ఊవ్విల్లూరుతాయని చెప్పింది.
దాంతో పాటు ప్రభాస్ గురించి శ్రీదేవి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెల్లడింది. డార్లింగ్ ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అయినప్పటికీ తాను తినే వరకే తింటాడని.. కానీ ఇతరులను మాత్రం తినేవరకు వదిలిపెట్టరని తెలిపింది. తాను మోతాదులో తిని ఇతరులను మాత్రం తిన్సాలిందేనని చీట్ చేస్తుంటారని చెప్పింది. పైగా ఎవ్వరికి ఏ ఐటెం కావాలన్నా ప్రత్యేక వండిస్తారని తెలిపింది. ఇదిలా ఉంటే... ఇక ప్రభాస్ ఎప్పుడూ ఏదోక డైట్ లో మాత్రం తప్పకుండా ఉంటారంట. ఎంత ఆకలేసినా డైట్ రూల్స్ కు విరుద్ధంగా ఉండరంట.
కానీ ఆయన తినేప్పుడు మాత్రం ఏ ఒక్కటి తక్కువైనా అస్సలు భోజనమే చేయడంట మన డార్లింగ్. ఓ సారి కారం పొడులు లేవని.. అవి చేసే వరకు ఆగి ఫుడ్ తిన్నాడంట ప్రభాస్. అలాగే తన ఫ్రెండ్స్ కోసం అర్ధరాత్రి కూడా భోజనాలు వండించి పెడ్తారంట... కానీ సినిమాల్లో నయా లుక్స్ తో అదరగొట్టేందుకు డార్లింగ్ ఎప్పుడూ డైట్ ఫాలో అవుతూనే ఉంటారంట.. కనీసం చీట్ మీల్ కూడా యాక్సెప్ట్ చేయబోరని టాక్. ఇక ప్రభాస్ - శ్రీదేవి కాంబోలో 'ఈశ్వర్' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. నెక్ట్స్ ప్రభాస్ 'రాజా సాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి2' వంటి చిత్రాలతో అలరించబోతున్నారు.


Click it and Unblock the Notifications











