Heroine Sunaina: హస్పిటల్ బెడ్‌పై యువ హీరోయిన్.. ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై బ్యూటీ క్లారిటీ?
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సునైన గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏడాది మరో రెండు తెలుగు చిత్రాలు చేసిన ఈ క్యూట్ బ్యూటీ, ఇంకో మలయాళ సినిమా కూడా చేసింది. అలా వరుసగా చిత్రాలు చేసిన ఈమె తెలుగుతో పాటు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. 34 ఏళ్ల వయసున్న సునైన క్రేజీ ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. అయితే చివరగా రాజా రాజ చోర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంది. ముఖ్యంగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తుంది. తాజాగా ఈమె ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఆస్పత్రి పాలైనట్లు చెబుతూ రెండు ఫొటోలను షేర్ చేసింది. అందులో సెలైన్ పెట్టుకొని పడుకొని కనిపించింది. ఈ ఫొటోలతో పాటు నాకు కొంత మసయం ఇవ్వండి, నేను త్వరలోనే స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని రాసుకొచ్చింది. అయితే దీనిపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు.

ముఖ్యంగా ఇది నిజమేనా, లేక ఏదైనా స్టంట్ చేస్తున్నావా అంటూ ట్రోలింగ్ చేశారు. గతంలో ఆమె కనిపించడం లేదంటూ కోలీవుడ్ లో ఓ వార్త తెగ వైరల్ అయింది. ఎవరో కిడ్నాప్ చేశారని, ఫోన్ కూడా రెండ్రోజుల పాటు స్విచ్థాఫ్ అయిందని ప్రచారం జరిగింది. అది తెలుసుకున్న అభిమానులంతా తెగ కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగగా.. ఆమె కావాలనే అలా చేసినట్లు గుర్తించారు. రేజీనా అనే ఓ సినిమా ప్రమోషన్ కోసం ఆమె అలా చేసినట్లు తెలుసుకొని షాకయ్యారు. ఆమె చేసిన ప్రమోషన్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే తాజాగా సునైన ఆస్పత్రిలో ఉన్నానంటూ ఫొటోలు షేర్ చేయడం, అందులో ఎలాంటి కారణమూ చెప్పకపోవడంతో.. ఇది కూడా సినిమా స్టంట్ యే అని చాలా మంది భావించారు. ఈక్రమంలోనే విపరీతంగా ట్రోల్స్ చేశారు. విషయం తెలుసుకున్న సునైన దీనిపై స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగానే మరో పోస్టు కూడా చేసింది. నేను ఇప్పుడు కాస్త బాగానే ఉన్నా, త్వరలోనే లేచి నడవగలనూ అంటూ చెప్పుకొచ్చింది. థాంక్స్ అంటూ వివరణ ఇచ్చింది.
ఇదంతా చూస్తుంటే సునైన నిజంగానే ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు అర్థం అవుతుంది. ఈక్రమంలోనే ఆమె ఆస్పత్రికి వెళ్లడం, చికిత్స తీసుకోవడం జరుగుతోంది. త్వరలోనే ఆమె పూర్తిగా నమయై.. ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











