For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొమ్మిదో తరగతిలోనే అలాంటి రిలేషన్స్.. పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేసి బాగా ఏడ్చేశా: తాప్సి

    |

    ఝుమ్మంది నాథం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను. అమ్మడి అదృష్టం ఏమిటో గాని మొదట్లో కష్టపడిన చోట హిట్స్ దక్కలేదు. పెద్ద సినిమాల్లో నటించినా కూడా అనుకున్నంతగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ లో సీరియస్ గా ప్రయత్నాలు చేసిందో అప్పటి నుంచి అగ్ర నటిగా క్రేజ్ అందుకుంటోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి తన ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టింది.

    ప్రియుడితో కలిసి మాల్దీవ్స్ లో..

    ప్రియుడితో కలిసి మాల్దీవ్స్ లో..

    ఇటీవల అందరికంటే మొదట తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవ్స్ ప్రదేశాలకు వెళ్లింది. కొన్నిరోజులు పాటు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసింది. ప్రియుడు మాతియాస్‌తో కలిసితో స్కూబా డైవ్ కూడా చేసింది. ఇక కెమెరాకు ఫోజిచ్చిన చిత్రాలను తమ ఇన్స్‌టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఆమె తరువాత మరికొందరు స్టార్ హీరోయిన్స్ కూడా మాల్దీవ్స్ బాట పట్టారు.

    త్వరలో బాలీవుడ్ సినిమాలతో బిజీగా

    త్వరలో బాలీవుడ్ సినిమాలతో బిజీగా

    కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల ఇంట్లోనే ఉండడం వలన బోర్ కొట్టేసిందట. అందుకే అమ్మడు మాల్దీవ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేసింది. వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు చెబుతూ ఇప్పటికె ఒక కోలీవుడ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. అలాగే రానున్న రోజుల్లో పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నట్లు వివరణ ఇచ్చింది తాప్సి.

    పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఎడ్చేశాను

    పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఎడ్చేశాను

    ఇక తన చిన్నప్పటి ప్రేమ గురించి మాట్లాడుతూ.. తొమ్మిదో తరగతిలోనే ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. అతడు కూడా నన్ను ఇష్టపడ్డాడు. అతడే నా ఫస్ట్ క్రష్. ఇక చదువుకోవాలనే కారణం చేత కొంతకాలానికి మాట్లాడటం మానేశాడు. ఒకసారి బాధతో పబ్లిక్ ఫోన్ నుంచే అతనికి ఫోన్ చేసి బాగా ఎడ్చేశాను కూడా. ఎప్పటికైనా ఫస్ట్ క్రష్ అనేది స్వీట్ మెమోరీగానే ఉంటుంది.

    Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
    అందం అంటే స్కిన్ షో చేయడం కాదు.

    అందం అంటే స్కిన్ షో చేయడం కాదు.

    అందంగా కనిపించాలి అంటే కేవలం స్కిన్ షో చేస్తే సరిపోదు. ఆ విషయంలో నేను కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నాను. కొంతవరకు గ్లామర్ రోల్స్ చేయవచ్చు కానీ బికినీ వేయడం అంటే నాకు ఏ మాత్రం నచ్చదు. అభిమానులు కూడా నన్ను బికినీలో చూడటానికి ఇష్టపడరని నాకు తెలుసు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం వేసుకోక తప్పలేదు. బికినీ అంటే నాకు ఏ మాత్రం నచ్చదు.. అంటూ వివరణ ఇచ్చింది తాప్సి.

    English summary
    Movie stars who are always busy with movie shootings go abroad for holidays even if there is a gap. Locally, people go to holiday spots that are not crowded and enjoy the solitude. But now all the star heroines are going to set a special holiday spot as a target. Same Maldives. However a rumor behind it has now become a hot topic. They all seem to be enjoying it without spending a dime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X