Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తొమ్మిదో తరగతిలోనే అలాంటి రిలేషన్స్.. పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేసి బాగా ఏడ్చేశా: తాప్సి
ఝుమ్మంది నాథం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి తాప్సి పన్ను. అమ్మడి అదృష్టం ఏమిటో గాని మొదట్లో కష్టపడిన చోట హిట్స్ దక్కలేదు. పెద్ద సినిమాల్లో నటించినా కూడా అనుకున్నంతగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే బాలీవుడ్ లో సీరియస్ గా ప్రయత్నాలు చేసిందో అప్పటి నుంచి అగ్ర నటిగా క్రేజ్ అందుకుంటోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి తన ఫస్ట్ క్రష్ గురించి బయటపెట్టింది.
ప్రియుడితో కలిసి మాల్దీవ్స్ లో..
ఇటీవల అందరికంటే మొదట తాప్సి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాల్దీవ్స్ ప్రదేశాలకు వెళ్లింది. కొన్నిరోజులు పాటు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసింది. ప్రియుడు మాతియాస్‌తో కలిసితో స్కూబా డైవ్ కూడా చేసింది. ఇక కెమెరాకు ఫోజిచ్చిన చిత్రాలను తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. ఆమె తరువాత మరికొందరు స్టార్ హీరోయిన్స్ కూడా మాల్దీవ్స్ బాట పట్టారు.
త్వరలో బాలీవుడ్ సినిమాలతో బిజీగా
కరోనా కారణంగా దాదాపు ఆరు నెలల ఇంట్లోనే ఉండడం వలన బోర్ కొట్టేసిందట. అందుకే అమ్మడు మాల్దీవ్స్ కు వెళ్లి ఎంజాయ్ చేసింది. వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు చెబుతూ ఇప్పటికె ఒక కోలీవుడ్ సినిమా షూటింగ్ ని పూర్తి చేసినట్లు క్లారిటీ ఇచ్చింది. అలాగే రానున్న రోజుల్లో పలు బాలీవుడ్ సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నట్లు వివరణ ఇచ్చింది తాప్సి.
పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఎడ్చేశాను
ఇక తన చిన్నప్పటి ప్రేమ గురించి మాట్లాడుతూ.. తొమ్మిదో తరగతిలోనే ఒక అబ్బాయిని ఎంతగానో ఇష్టపడ్డాను. అతడు కూడా నన్ను ఇష్టపడ్డాడు. అతడే నా ఫస్ట్ క్రష్. ఇక చదువుకోవాలనే కారణం చేత కొంతకాలానికి మాట్లాడటం మానేశాడు. ఒకసారి బాధతో పబ్లిక్ ఫోన్ నుంచే అతనికి ఫోన్ చేసి బాగా ఎడ్చేశాను కూడా. ఎప్పటికైనా ఫస్ట్ క్రష్ అనేది స్వీట్ మెమోరీగానే ఉంటుంది.
Recommended Video
అందం అంటే స్కిన్ షో చేయడం కాదు.
అందంగా కనిపించాలి అంటే కేవలం స్కిన్ షో చేస్తే సరిపోదు. ఆ విషయంలో నేను కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నాను. కొంతవరకు గ్లామర్ రోల్స్ చేయవచ్చు కానీ బికినీ వేయడం అంటే నాకు ఏ మాత్రం నచ్చదు. అభిమానులు కూడా నన్ను బికినీలో చూడటానికి ఇష్టపడరని నాకు తెలుసు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం వేసుకోక తప్పలేదు. బికినీ అంటే నాకు ఏ మాత్రం నచ్చదు.. అంటూ వివరణ ఇచ్చింది తాప్సి.