సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నా సైలెంట్‌గా వీడియో వైరల్.. తాప్సీ వివాహం ఎలా జరిగిందో చూశారా?
ఈ మధ్య కాలంలో అనేక మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకుంటూ ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. కొందరు చెప్పి చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం చెప్పకుండా.. సీక్రెట్ గా మూడు ముళ్లు వేయించేసుకుంటున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బందాలు పెళ్లిళ్లు చేసుకోగా.. తాజాగా తాప్సీ పన్ను కూడా తన ప్రియుడినే పెళ్లాడింది. అయితే ఈ విషయాన్ని ఆమె అఫీషియల్ గా ప్రకటించకపోయినా అందరికీ తెలిసిపోయింది. అయితే తాజాగా ఈమె పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కూడా తన అందం, అభినయంతో అనేక అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడే చిత్రాలు చేస్తూ కెరియర్ లో ముందుకు వెళ్తుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో బాగానే ముందుకెళ్తున్న ఈమె తాజాగా పర్సనల్ లైఫ్ లో కూడా ఓ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా తన ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మార్చి 23వ తేదీన ఈ ముద్దుగుమ్మ... డెన్మార్క్ బ్యాడ్మింటర్ ప్లేయర్ మథియాస్ బోను వివాహం చేసుకున్నట్లు తెలిసింది. అయితే పదేళ్లుగా రిలేషన్లో ఉన్న ఈ జంట.. పెళ్లితో ఒక్కటి కావాలని భావించారట. అనుకున్నదే తడువుగా.. అంటే మార్చి 20వ తేదీన వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం మొదలు పెట్టేశారట. 23వ తేదీన పెళ్లి కూడా జరిగినట్లు అందరికీ తెలిసిపోయింది.
ముఖ్యంగా ఉదయ్ పూర్ లో అతి తక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాం అంగరంగ వైభవంగా జరిగినట్లు సమాచారం అందింది. అయితే పెళ్లి అయిన తర్వాత 15 రోజులకు వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అఫీషియల్ గా ఈ జంట ఈ విషయాన్ని వెల్లడించకపోయినా, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోయినా.. నెట్టింట వీడియోలు ప్రత్యక్షం అవడంతో వీరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా వారి పెళ్లి వీడియో చూసేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
తాప్సీ తమ సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి పందిట్లోకి వచ్చింది. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా డ్యాన్స్ చేస్తూ.. రాగా ఆమె ప్రియుడు బో కూడా ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ, డ్యాన్స్ చేస్తూ.. దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి.


Click it and Unblock the Notifications











