Taapsee Pannu Wedding: 36 ఏళ్ల వయసులో సీక్రెట్‌గా ప్రియుడిని పెళ్లాడిన తాప్సీ.. ఎక్కడో తెలుసా?

గతేడాది చివరి నుంచి అనేక మంది కుర్ర హీరోహీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమకు నచ్చిన వారితో మూడు ముళ్లు వేయించుకుంటూ ఓ ఇంటి వాళ్లు అయిపోతున్నారు. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని పెళ్లి చేసుకోగా.. కృతి కర్బందా కూడా ఈనెలలోనే తన ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకోనుంది. అలాగే కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె తన ప్రియుడిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన తాప్సీ పన్ను అందరికీ తెలుసు. అయితే అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సీక్రెట్ గా తన ప్రియుడుని వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వీరి పెళ్లికి వేడుకల్లో పలువురు దిగిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

Heroine Taapsee Pannu Marry her Boy Friend Mathias Boe Secretly And Photos Goes Viral

డెన్మార్క్ బ్యాడ్మింటర్ ప్లేయర్ మథియాస్ బోతో హీరోయిన్ తాప్సీ పన్ను ప్రేమలో ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో సినిమాలు చేసే తాప్సీ ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం అక్కడే చిత్రాలు చేస్తూ పుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది. అయితే బాలీవుడ్ కు వెళ్లిన తొలి నాళ్లలోనే ఈమెకు మథియాస్ తో స్నేహరం ఏర్పడినట్లు సమాచారం. ఆ స్నేహమే కొంత కాలానికి ప్రేమగా మారిందట. ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మార్చి 20వ తేదీన వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా... 23న పెళ్లి కూడా జరిగినట్లు అంతా అనుకుుంటున్నారు. ఉదయ్ పూర్ లో అతి తక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాం అంగరంగ వైభవంగా జరిగినట్లు అర్థం అవుతుంది. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా వీరి పెళ్లికి వెళ్లినట్లు.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడంతో తాప్సీ పెళ్లి వార్తలు నిజమేనంటూ ప్రచారం సాగుతోంది.

Heroine Taapsee Pannu Marry her Boy Friend Mathias Boe Secretly And Photos Goes Viral

అయితే ఇటు తాప్సీ కానీ, అటు మథియాస్ కానీ వీరి వివాహం గురించి అధికారికంగా ప్రకటించలేదు. కనీసం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేయలేదు. చూడాలి మరి ఎవరైనా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తారా.. లేక వీళ్లే తమ పెళ్లి గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తారా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X