Taapsee బాయ్‌ఫ్రెండ్‌తో సీక్రెట్ మ్యారేజ్.. లాగి చెంపదెబ్బ కొట్టినట్టు గట్టి కౌంటర్ ఇచ్చిన తాప్సీ!
ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పెళ్లి పీటలెక్కుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ కూడా తన బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లి సిద్ధమైనట్లు, సీక్రెట్‌గా చేసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై ఈ సొట్ట బుగ్గల సుందరి స్పందించింది. వారందరికి గట్టి కౌంటర్ వేస్తూ ఇచ్చి పడేసింది. దాని గురించే ఈ కథనం..
సొట్ట బుగ్గల సుందరిగా: రింగుల జట్టు వేసుకుని సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ తాప్సీ. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ మంచు మనోజ్ నటించిన 'ఝమ్మంది నాదం' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ, గోపిచంద్, ఆది పిన్నిశెట్టి, ప్రభాస్, రానా వంటి హీరోలతో కలిసి నటించింది. దరువు, మొగడు, మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, గుండెల్లో గోదారి, ఆనందోబ్రహ్మ, నీడ, ఘాజీ, నీవెవరో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

హిందీ ఇండస్ట్రీకి చెక్కేసింది: కోలీవుడ్‌లోనూ కాంచనతో పాటు పలు సినిమాల్లో నటించి మెప్పించేందుకు ప్రయయ్నించింది. కానీ స్టార్ స్టేటస్‌ను అందుకోలేదు. ఆ తర్వాత హిందీ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఆ తర్వాత చష్మే బద్హూర్, బేబీ చిత్రాల్లో నటించింది. అనంతరం పింక్ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకుంది. అనంతరం రన్నింగ్ షాది, నామ్ షబానా, దిల్ జుంగ్లీ, సూర్మ, ముల్క్ , బడ్లా, తప్పడ్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి విజయాల్ని సాధించింది.

ప్రేమలోనూ పడింది: ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్ను షేర్ చేసి కుర్రాళ్లను కవ్వించింది. బికినీ పోజులతో ఎక్కువగా కనిపించేది. అలా నెట్టింట్లోనూ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా జర్నీలోనే ప్రేమలోనూ పడింది. సౌత్ నుంచి నార్త్‌కు వెళ్లిన తొలినాళ్లలో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో రిలేషన్షిప్ కొనసాగించింది. ఈ విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో అఫీషియల్‌గా తెలిపింది.

తాప్సీ రియాక్ట్: పదేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు స్పష్టత ఇచ్చిన ఆమె తామిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి. ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. అయితే తాజాగా దీనిపై నటి తాప్సీ రియాక్ట్ అయింది. తనపై ప్రచారం చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది.

రెండు చిత్రాలు రిలీజ్‌కు రెడీగా: నా పర్సనల్ లైఫ్‌కు సంబంధించి నేను ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఇవ్వను అని తాప్సీ చెప్పుకొచ్చింది. రీసెంట్గా గతేడాది డిసెంబర్లో షారుక్‌తో కలిసి డంకీ చిత్రం చేసింది. ప్రస్తుతం ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా అనే సినిమా చేస్తోంది. హసీన్ దిల్‌రుబాకు ఇది సీక్వెల్‌గా రూపొందుతోంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటే ఆమె నటించిన మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











