Tabu: 50 ఏళ్ల వయసులోనూ వావ్ అనిపిస్తున్న టబు అందాలు.. హద్దు దాటిన హైదరాబాదీ!
Tabu: విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ 1 సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు ఇచ్చిన టబు.. ఇప్పటికీ హీరోయిన్ గా తన ప్రతిభ చాటుకుంటోంది. రోజురోజుకూ వయసు పెరగాల్సింది పోయి ఆమెకు అందం పెరిగిపోతుంది. ఇప్పటికీ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ... తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. కానీ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయింది. మూడున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తూనే ఉంది.
తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ వాటి ద్వారానే యమా క్రేజ్ సంపాధించింది. బాలీవుడ్ కు వెళ్లిపోయినా.. తెలుగు సినీ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంది. ఓ వైపు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్లు బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సామాజిక మాధ్యమాల్లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టా వేదికగా ఈమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అందులో అదిరిపోయే లుక్కులో కనిపిస్తూ.. అందరికీ కిక్కెస్తోంది. 52 ఏళ్ల వయసు మీదకు వచ్చినా ఏమాత్రం ఆమె వన్నె తరగలేదు. బ్లాక్ కలక్ సింగిల్ పీస్ లో అందాలను ఆరబోసింది. వన్ సైడ్ ఫుల్ హ్యాండ్, వన్ సైడ్ స్లీవ్ లెస్ ఉన్న ఈ డ్రెస్సు టబుకు చాలా బాగా సెట్ అయింది. ఈ ఫొటోల్లో ఎద అందాలతో పాటు థైస్ అందాలను చాలా బాగా చూపిస్తోందీ ముద్దుగుమ్మ. చేతులు పైకెత్తి, మత్తుగా పడుకున్నట్లు స్టిల్ ఇస్తూ.. కుర్రకారును మాయ చేస్తోంది. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి.
నెట్టింటి టబు ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఆమె షేర్ చేసే బోల్డ్ ఫొటోల కోసం నెటిజెన్లు తెగ వేచి చేస్తూ ఉంటారు. ఇక ఆమె ఫొటోలు పెట్టడమే ఆలస్యం లైకులు, కామెంట్లు, షేర్లతో రెచ్చిపోతుంటారు. తాజాగా పెట్టిన ఫొటోలపై కూడా ఇలాగే స్పందిస్తున్నారు. ఎద అందాలను పెద్దగా హైలెట్ చేయకపోయేసరికి కాస్త నిరాశకు గురైన అభిమానులు... కామెంట్ల రూపంలో తమ మనసులోని భావాలను వెల్లడిస్తున్నారు.

రోజురోజుకూ వయసు పెరుగుతున్నా అదేమీ పట్టించుకోకుండా అన్ని రకాల చిత్రాల్లోనూ నటిస్తోందీ సీనియర్ హీరోయిన్. గతేడాది దృశ్యం 2 సినిమాతో భారీ హిట్టును తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ భూల్ భులాయ్ లోనూ నటించింది. ఈ సంవత్సరం కుత్తే, భోళాతో వచ్చి అందరినీ మెప్పించింది. ఇటీవలే ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ కోసం ఖుషియా అనే సిరీస్ ను చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచే ఈ ఖుషియా సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో టబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.


Click it and Unblock the Notifications











