చచ్చిపోతానేమోనని భయమేసింది.. ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు: తమన్నా
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ లలో ఒకరైన తమన్నా భాటియా ఏళ్ళు గడుస్తున్నా ఇంకా తన అందంతో ఎంతగానో క్రేజ్ అందుకుంటోంది. పోటీగా ఎంత మంది హాట్ బ్యూటీలు వచ్చినా కూడా తమన్నా అందం ముందు నిలవలేరనే చెప్పాలి. పెద్ద సినిమాల్లో కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ తమన్నా తన గ్లామర్ లో మాత్రం అదే రేంజ్ లో లెవెల్ మెయింటైన్ చేస్తోంది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఒక బావోద్వేగమైన విషయాన్ని బయటపెట్టింది.

ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం
రీసెంట్ గా తన పరిస్థితి అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్స్ చేశారని అది తనను ఎంతగానో కలచివేసినట్లు చెప్పింది. అంతకుముందు చనిపోతానేమో అనే భయం కూడా వేసినట్లు వివరణ ఇచ్చిన తమన్నా ఒక్కసారిగా ఆమె అభిమానులను షాక్ కి గురి చేసింది. గత కొన్ని రోజుల క్రితం తమన్నా కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి ఆమె మాట్లాడింది.

చనిపోతానేమోనని భయం వేసింది
తమన్నా మాట్లాడుతూ.. కోవిడ్-19 పరీక్షల్లో పాజిటివ్ అని తెలియగానే ఎంతగానో కంగారు పడ్డాను. ఒక విధంగా ప్రాణ భయం వేసింది. ట్రెట్మెంట్ తీసుకుంటున్న సమయంలో చనిపోతానేమోనని భయం వేసింది. ఎందుకంటే కరోనా లక్షణాలు నాలో అధికంగా కనిపించాయి. అప్పుడు వైద్యులు నన్ను జాగ్రత్తగా కాపాడారు. వాళ్ళ వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను.

జీవితం విలువ తెలిసింది
ఆ సమయంలో నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్న నా తల్లిదండ్రులను కూడా నేను ఎప్పటికి మరచిపోలేను. వాళ్ళకు రుణపడి ఉంటాను. ఆ భయానక సమయంలోనే జీవితం ఎంత విలువయ్యిందో అర్ధమయ్యింది. అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత కాస్త సంతోషంగా మారే లోపు కొందరు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేశారు.
Recommended Video

ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు
కరోనా ట్రెట్మెంట్ తీసుకునే సమయంలో వైద్యులు ఇచ్చిన మందుల కారణంగా ఒక్కసారిగా బరువు పెరిగాను. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఓ ఫొటో షేర్ చేస్తే.. అది చూసి చాలా మంది లావుగా ఉన్నావని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేశారు. ఒకరి గురించి కామెంట్ చేసేటప్పుడు అసలు ఆ వ్యక్తికి అంతకుముందు ఏమయ్యింది అని ఆలోచించకుండా.. కేవలం లోపలపై కామెంట్స్ చేస్తారనే విషయం అప్పుడు నాకు చాలా క్లియర్ గా అర్ధమయ్యిందని తమన్నా వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











