Tamannaah Bhatia తమన్నా గుడ్ న్యూస్... ఆ హీరోయిన్స్ బాటలోనే?
ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఆ భాష ఈ భాష అని తేడా లేకుండా దాదాపు అన్ని భాషలకు చెందిన హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు ఎవరికి వారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే పదానికి గుడ్ బై చెప్పి ఒక రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది హీరోలు హీరోయిన్లు వివాహం చేసుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఆమె ఎవరు ఎప్పుడు వివాహం జరగబోతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
స్టార్ హీరోయిన్ గా...
తమన్నా భాటియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఆమె... ఆ తర్వాత పలు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఊహించని విధంగా ఆమె చేసిన హ్యాపీడేస్ సినిమా ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చి పెట్టింది.

వెనకబడిపోయింది...
శేఖర్ కమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కాలేజ్ లవ్ డ్రామా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా కావడమే కాదు అందులో నటించిన దాదాపు అందరూ హీరోలకు హీరోయిన్లకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ హ్యాపీడేస్ సినిమా తర్వాత తమన్నా భాటియా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అనేక సినిమా అవకాశాలు ఆమెకు లభించాయి. టాలీవుడ్ లో దాదాపు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్, వెంకటేష్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలు అందరితో జతకట్టిన ఆమె ఇప్పుడు ఎందుకో హీరోయిన్ రేసులో వెనుకబడింది.
విజయవర్మతో రిలేషన్లో...
కుర్ర హీరోయిన్లు రంగంలోకి దిగడంతో సీనియర్ హీరోయిన్ అయిన ఈమెకు సీనియర్ హీరోల పక్కన తప్ప అవకాశాలు దొరకడం లేదు. ఇక తన టైం అయిపోయింది అనుకుందో ఏమో తెలియదు కానీ ఆమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రస్తుతానికి రిలేషన్ లో ఉంది.

పెళ్లికి రెడీ...
తెలుగులో ఎంసీఏ లాంటి సినిమా చేసిన విజయ్ వర్మ హిందీలో ఇప్పుడు ప్రస్తుతం బిజీ యాక్టర్ గా ఉన్నాడు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడడం ఆ పరిచయం ప్రేమగా మారడంతో వివాహానికి సిద్ధమవ్వాలని ఎప్పుడో అనుకున్నారు. గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరు ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. వీలైనంత త్వరలో వీరి వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
వారి స్టైల్ లోనే...
ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లు ఎలా అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సిటీలకు దూరంగా రాజస్థాన్ గోవా లాంటి ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటున్నారో తమన్నా కూడా అలాగే చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎక్కడ వివాహం చేసుకుంటే బాగుంటుంది గెస్టులందరినీ ఎక్కడ అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయగలం అనే విషయాల మీద చర్చలు జరుపుతూ లొకేషన్స్ వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు. అది ఫైనల్ అయితే అధికారికంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసి ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











