హీరోయిన్ తమన్నా సినిమాల్లో నటించి ఇన్ని కోట్లు వెనకేసిందా?

'స్టారీ హీరోల పక్కన తమన్నా.. వరుస సినిమాలు చేస్తూ... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక వచ్చే నెలలో తమన్నా మూవీస్ రెండు రిలీజ్ కానున్నాయి. జైలర్, భోళాశంకర్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తమన్నా.. ఆస్తులు బాగానే వెనుకెసిందని తెలుస్తోంది. హీరోయిన్ తమన్నా.. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందని తెలుస్తోంది. ఆమె ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

తమన్నా క్రేజ్... :హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2005లో మంచు మనోజ్ తో కలిసి.. శ్రీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీడేస్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ను, గుర్తింపును తమన్నాకు తెచ్చిపెట్టింది.

Heroine Tamannaah earned so many crores by acting in movies?

విడుదలకు సిద్ధంగా రెండు.. :అటు తమిళం హిందీ భాషల్లో కూడా తమన్నా సినిమాలు చేస్తూ ముందుకెళ్లింది. 2009లో వచ్చిన ఇష్టం కొంచెం కష్టం 100% లవ్ సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా తమన్నా ముందుకెళ్ళింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా తమన్నా ప్రస్థానం కొనసాగిస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తుండగా.. చిరంజీవితో కలిసి భోళాశంకర్ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కోట్ల ఆస్తులు.. :ఇదిలా ఉంటే తమన్నా ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మిల్కీ బ్యూటీ చేసిన సినిమాలు.. స్టార్ హీరోలతో చేసినవే. అయితే ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది. బోల్డ్ సీన్స్ లోనూ నటించి... అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక ఈమె తన లవర్ విజయ్ వర్మతో చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతూ...ఇటీవల వీరి ప్రేమ గురించి బయటపెట్టింది. అటు లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లోనూ విజయ్ తో బోల్డ్ సీన్స్ లో నటించి షాక్ ఇచ్చింది. ఇక వరుసు సినిమాలు చేస్తూ... తమన్నా కోట్లను ఆస్తులు వెనకేసినట్లు సమాచారం.

Heroine Tamannaah earned so many crores by acting in movies?

బిజినెస్ రంగంలోనూ.. :తమ‌న్నా పేరిట కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. తమన్నా.. లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుందని తెలుస్తోంది. దాదాపు 17 ఏళ్ల నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా బిజీగా గడిపేస్తోంది. ఒక్కో సినిమాకు తమన్నా 3 నుంచి 4 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందని సమాటాంర. వీటితో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ బాగానే కూడబెట్టిందని తెలుస్తోంది. అంతే కాదు ఈ బ్యూటీ బిజినెస్ రంగంలోనూ అడుగు పెట్టి.. కోట్లు సంపాదిస్తుంది. 2015లో ఆమె వైట్ గోల్డ్ పేరుతో జ్యూవ్వెలరీ బిజినెస్ ను ప్రారంభించింది. ఈ వ్యాపారంలో మిల్కీ బ్యూటీ సూప‌ర్ స‌క్సెస్ అయింది.

Heroine Tamannaah earned so many crores by acting in movies?

ఆస్తుల విలువ...:ఇక త‌మ‌న్నా ఏడాదికి 15 కోట్ల‌కు పైగా సంపాదిస్తుంద‌ని సమాచారం. సంపాద‌న విష‌యంలో స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ లేదని తెలుస్తోంది. ఆమె ఆస్తుల విలువ మొత్తంగా 120 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంటున్నారు. అంతే కాదు కోట్ల విలువ చేసే ప్రాపర్టీస్ ఆమె సొంతం. లక్జరీ కార్లు, ఇళ్ల కూడా ఉన్నాయట. ముంబైలోని వెర్సోవాలో 16 కోట్లు విలువ చేసే విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్ త‌మ‌న్నాకు ఉంది. ల్యాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డ‌బ్లూ 5 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి అనేక ల‌గ్జ‌రీ కార్లు త‌మ‌న్నా గ్యారేజ్ లో ఉన్నాయి. దీంతో తమన్నా ఆస్తుల గురించి తెలుసుకుని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X