తమన్నాకు ఘోర అవమానం.. అయినవాళ్లే అంత మాట అనేశారేంటి.. అసలేం జరిగిందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఈ భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా.. ఆమె సినిమాల్లోకి రాకముందు చాలా మంది అవమానించారట. సినిమాల్లోకి వెళ్తా అని తమన్నా చెబితే.. దారుణంగా మాట్లాడారంట. వాళ్లు ఎవరు.. తమన్నా వారికి ఎలా కౌంటర్ ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే...
మిల్కీ బ్యూటీ తమన్నా...:తమన్నా భాటియా... మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల దృష్టిలో పడి... హ్యాపీడేస్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాతో ఆమె జాతకం మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.

18ఏళ్లుగా స్టార్ హీరోయిన్...:ఇక సౌత్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నా.. ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరు ఇద్దరూ డేటింగ్ చేస్తూ.. ఇటీవలే వీరి ప్రేమ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ వర్మ, తమన్నా.. ఇద్దరూ లస్ట్ స్టోరీస్ 2 లో కనిపించారు. ఇక ఈ సిరీస్ లో తమన్నా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. విజయ్ వర్మతో తమన్నా రొమాన్సో ఓ రేంజులో ఉందని కామెంట్స్ వినిపించాయి. ఇక జీ కర్దా సిరీస్ లోనూ తమన్నా నటించింది.
ఏ ఇండస్ట్రీ అయినా...:టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. మూడు సినిమా ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్న తమన్నా.. తక్కువ టైంలోనే స్టార్ హీరోస్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఇలాంటి తమన్నా... కెరియర్ ప్రారంభంలో తాను హీరోయిన్ అవుతా అంటే.. దారుణంగా అవమానించారట. నువ్వు హీరోయిన్ ఏంటి.. నీ మోహానికి అవసరమా అని హర్ట్ చేశారట. తమన్నాను ఇలా దారుణంగా అవమానించింది ఎవరో కాదు.. ఆమె బంధువులేనట.

దారుణంగా అవమానం...:తమన్నా సినిమా రంగంలోకి వెళ్తాను అన్నప్పుడు వాళ్లు.. నీ మొహాన్ని చూసి ఎవరు ఛాన్స్ ఇస్తారు అంటూ ఎగతాళి చేశారట. దీనితో తమన్నా.. ఎలాగైనా హీరోయిన్ అయి చూపించాలని అప్పుడే అనుకుంది. తన పట్టుదలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఎవరైతే ఈమెను అవమానించారో... వాళ్లే తమన్నా మా అమ్మాయి అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారట. అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండింటిపైనే ఆశలు...:తమన్నా విషయానకిి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నాతో పాటు కీర్తి సురేష్ కూడా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తమన్నా సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ జైలర్ లోనూ నటిస్తోంది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కావాలయ్యా రావాలయ్యా పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఎక్కడా చూసినా ఈ పాట హవానే నడుస్తోంది. ఈ రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిపైన మిల్కీ బ్యూటీ భారీ ఆశలే పెట్టుకుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











