సౌత్ ను ఏలుతున్న త్రిష.. సీనియర్ హీరోయిన్లకు ఇదేనా ఛాలెంజ్!

సౌత్ లో బడా హీరోయిన్ల జాబితాలో త్రిష పేరు ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండున్నర దశాబ్దాలుగా దక్షిణాది ఆడియెన్స్ ను వరుస చిత్రాలతో అలరిస్తోంది. విభిన్న పాత్రలతో వెండితెరపై ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ వరకు బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. తన నటనతో ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇండస్ట్రీలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. పేరు తమిళ హీరోయిన్ అయినా.. తెలుగు ఆడియెన్స్ కు ఎక్కడా ఆ తేడా కనిపించకుండా కెరీర్ ను సాగించింది. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తూనే ఉంది. స్టార్ హీరోలకు జోడీగా కనిపించడమే కాకుండా ఫీమేల్ ఓరియెంటెడ్ కథలతోనూ తనదైన మార్క్ ను ప్రదర్శిస్తోంది.

తెలుగులో 'వర్షం' చిత్రంతో త్రిష సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. దాదాపుగా రెండు దశాబ్దాల కింద విడుదలైన ఈ చిత్రం నేటికీ ఆడియెన్స్ గుండెల్లోనే పదిలంగా ఉంది. డార్లింగ్ ప్రభాస్ సరసన త్రిష నటనకు అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి. ఆమె టాలెంట్ తో ఇండస్ట్రీ పెద్దలనూ మెప్పించింది. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లను దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. 20 ఏళ్లకు పైగా తన నటనా జీవితాన్ని విజయ పథంలో నడిపిస్తోంది. ఫ్యాన్స్ ను మరింతగా ఆకట్టుకుంటూనే ఈతరం ఆడియెన్స్ ను కూడా తన దారిలోకి తెచ్చుకుంటోంది.

Heroine Trisha Challenge to Tollywood Heroines with Her Huge Lineup

ఇదిలా ఉంటే.. రెండున్నర దశాబ్దాలుగా త్రిష సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చలనచిత్ర పరిశ్రమలో భారీ మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాలకు వరల్డ్ వైడ్ మార్కెట్ పెరగడంతో కొత్త హీరోయిన్లకూ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఛాలెంజింగ్ రోల్స్ లో హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకనిర్మాతలకూ సవాల్ గానే మారుతోంది. ఈక్రమంలో యంగ్ హీరోయిన్లు కూడా తమ యాక్టింగ్ స్కిల్ తో ఆఫర్లను అందుకుంటూనే ఉన్నారు.

ఇన్ని పరిస్థితుల మధ్య కూడా ప్రస్తుతం భారీ చిత్రాలను లైనప్ చేసిన సీనియర్ హీరోయిన్ ఎవరంటే.. త్రిష పేరే చెప్పాలి. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ఏకంగా అరడజన్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అందులో నుంచి తమిళ చిత్రం 'విదాముయార్చి' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అజిత్ హీరోగా నటించిన ఈమూవీ ప్రేక్షకాదరణను పొందుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి జోరు కనబరుస్తోంది. ఇక ప్రమోషన్స్ లో త్రిష సందడి చేస్తూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటూనే ఉన్నారు.

Heroine Trisha Challenge to Tollywood Heroines with Her Huge Lineup

ఇదే క్రమంలో త్రిష లైనప్ పరిశీలిస్తే షాకింగ్ గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ భారీ చిత్రాలను లైనప్ లో పెట్టి ఆశ్చర్యపరుస్తోంది. యంగ్ హీరోయిన్లను దాటుకొని అవకాశాలను చేజిక్కించుకుంటోంది. తమిళంలో 'విదాముయార్చి' అలరించగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థంగ్ లైఫ్, సూర్య 45, మలయాళంలో రామ్, ఇక తెలుగు మెగాస్టార్ చిరంజీవి - వశిష్ట కాంబోలోని 'విశ్వంభర' చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే చిరు సరసన స్టాలిన్ మూవీలో నటించింది. ఇక ఎనిమిదేళ్ల తర్వాత తెలుగులో 'విశ్వంభర'లో నటిస్తుండటం.. పైగా చిరు సరసన త్రిష ఎలాంటి మేజిక్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలా త్రిష సౌత్ సినిమాలను ఏలుతూ ఫుల్ బిజీగా ఉండటం సంతోషంగా ఉందంటున్నారు అభిమానులు.

More from Filmibeat

Read more about: trisha vidaamuyarchi chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X