Trisha చాలా మందితో రిలేషన్ పెట్టుకున్నాను.. లవ్ ఎఫైర్స్‌పై నిజం ఒప్పుకున్న త్రిష!
త్రిష ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాల నుంచి అభిమానులను అలరిస్తూ కెరీర్లో ముందుకెళ్తోంది. ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ వయసు ప్రస్తుతం 40. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ ముద్దుగుమ్మ ఎంతో మందితో లవ్ అఫైర్స్ నడిపినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై త్రిష నోరు విప్పి అసలు విషయం చెప్పినట్లు తెలిసింది. దాని గురించే ఈ కథనం.
త్రిష వార్తలు వైరల్..:త్రిష ఈ పేరు ఎప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తన అందంతో ఓ సారి మీడియాలో చర్చనీయాంశమైంతే మరోసారి తనకొచ్చే బిగ్ ఆఫర్స్‌తో ట్రెండ్ అవుతుంటుంది. ఇంకో సారి కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. అలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి ఏదో ఒక వార్తలో నెట్టింట్లో దర్శనమిస్తూనే ఉంటుంది.

సెకండ్ ఇన్నింగ్స్ తో...:అయితే ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలోనే చాలా మంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. బడా చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తన క్యూట్ గ్లామర్ యాక్టింగ్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అలా చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఆ తర్వాత కొత్త కొత్త భామలు రావడంతో కొంత కాలం పాటు ఈమె హవా కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌తో ఆమె కెరీర్ పరుగులు పెడుతోంది.
చిరంజీవితో విశ్వంభర చిత్రంలో...:పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అయితే తన గ్లామర్‌తో అందాల తార ఐశ్వర్యా రాయ్ అందాన్నే బీట్ చేసింది. అనంతరం పలు సినిమాల్లో ఛాన్స్‌లను అందుకుంది. లియో చిత్రంలోనూ నటించింది. ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాతోనూ పలకరించింది. ఇప్పుడేమో టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తోంది. ఇంకా ఆమె చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి.
40కు చేరువైన నో పెళ్లి...:ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే వయసు 40కు చేరువైన ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్రిష పలువురితో లవ్ అఫైర్ నడిపినట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఓ బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం చేసుకుని క్యాన్సిల్ చేసుకుందని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. రానా దగ్గుపాటి, ధనుశ్, విజయ్ దళపతి సహా పలువురితో త్రిష సన్నిహితంగా ఉన్నట్లు బయట కథనాల్లోనూ రాసి ఉంది.

కాంట్రవర్సీల్లో త్రిష...:అయితే ఈ మధ్య త్రిష కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోందన్న సంగతి తెలిసిందే. నటుడు మన్సూర్ అలీ, ఓ తమిళ రాజకీయ నాయకుడు ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడామె మళ్లీ చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లకు తన లవ్ అఫైర్స్‌పై ఆమె రియాక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
లవ్ ఎఫైర్స్...:నేను చాలా మందితో డేటింగ్ చేశాను. రిలేషన్‌షిప్ పెట్టుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండదు. పెళ్లి అనేది ఓ బాధ్యత. అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఓ దశలో వచ్చింది. కానీ ఇప్పుడున్న వయసులో కచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ చాల ముఖ్యం. అది చాలా బాగుంటుంది. ఒకరి కోసం జీవించడం కన్నా మన కోసం మనం జీవించినప్పుడే లైఫ్‌కు ఓ అర్థం ఉంటుంది అని ఆమె చెప్పినట్లు కథనాల్లో రాసి ఉంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న త్రిష ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.


Click it and Unblock the Notifications











