Trisha Wedding Video: సీక్రెట్‌గా హీరోయిన్ త్రిష పెళ్లి... వెడ్డింగ్ వీడియో చూశారా?

కోలీవుడ్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అది పక్కన ఉంచితే త్రిష పెళ్లి చేసుకుందా? అది కూడా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట త్రిష పెళ్లి వీడియో వైరల్ గా అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...

1999 జోడి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన త్రిష... 2002లో హీరోయిన్ గా తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసి తెలుగులో నీ మనసు నాకు తెలుసు.. సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తరుణ్ సరసన త్రిష నటించింది. ఈ మూవీ తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయి ఆకట్టుకుంది.

Heroine Trisha Krishnan Ad Wedding Video Viral in Social Media

ఇక ఆ తర్వాత ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించి తెలుగువారికి మరింత దగ్గరైంది. ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస తమిళ, తెలుగు సినిమాలు క్యూ కట్టాయి. 20 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమని ఏలిందని చెప్పవచ్చు. గత ఏడాది పొన్నియన్ సెల్వన్ 1, రాంగీ వంటి చిత్రాలతో అలరించిన త్రిష... ఈ ఏడాది కొన్ని పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంతో మరోసారి మెప్పించింది.

Heroine Trisha Krishnan Ad Wedding Video Viral in Social Media

ఇదిలా ఉంటే త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో త్రిష పెళ్లి ఘనంగా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు... ఓ యాడ్ కోసం అని అర్థమవుతుంది. జువెలరీ యాడ్ కు సంబంధించిన వీడియోలో త్రిష పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు షాక్ అయిపోయారు.

Heroine Trisha Krishnan Ad Wedding Video Viral in Social Media

ఒక్కసారిగా యాడ్ కు సంబంధించిన క్లిప్స్ చూసి నిజంగానే త్రిష పెళ్లి చేసుకుందేమో అని షాక్ అయిపోయారు. అయితే సౌత్ క్వీన్ త్రిష ప్రముఖ జీఆర్టీ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ బ్రాండెడ్ జువెలరీ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన యాడ్ లో త్రిష నటించింది.

Heroine Trisha Krishnan Ad Wedding Video Viral in Social Media

ఇక ఈ జువెలరీ యాడ్ ను సూపర్ గా చిత్రీకరించారు మేకర్స్. ఈ యాడ్లో త్రిష పెళ్లి కూతురులానే కనిపిస్తుంది. పట్టు వస్త్రాలతో వంటి నిండా అద్భుతమైన నగలతో చూడచక్కగా పెళ్లికూతురు గెటప్ లో త్రిష కనిపిస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపించడం విశేషం. ఇప్పుడు ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.

దీనికి సంబంధించిన పిక్స్ చూసి త్రిష చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అంటూ కామెంట్ చేస్తున్నారు. తీరా విషయం తెలుసుకున్నాక కూల్ అవుతున్నారు. మీరు కనుక ఈ వీడియో చూడకపోతే ఒకసారి లుక్ వేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X