‘ప్యాంట్ వేసుకోవడం మరిచిపోలేదు.. ఆ క్రికెటర్ ఎక్కడంటే?’
దక్షిణాది సినిమా దగ్గర చిన్న పాత్రలు తోనే కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ యువతలో మంచి మార్క్ ని సెట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీస్ కొందరు కనిపిస్తారు. మెయిన్ గా ప్రస్తుత జెనరేషన్ యూత్ లో కొందరు క్యూట్ హీరోయిన్స్ కి సినిమాలు ఆఫర్స్ తో సంబంధం లేకుండా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. కాగా ఇలాంటి హీరోయిన్స్ లో కన్నడ యంగ్ బ్యూటీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం హార్డ్ కోర్ ఫ్యాన్ వర్ష బొల్లమ్మ కూడా ఒకరు అని చెప్పాలి.
కాగా తమిళ, తెలుగు ఇంకా కన్నడ సినిమాల్లో ఈ యంగ్ బ్యూటీ బాగా ఫేమస్. ఇంకా చెప్పాలంటే తమిళ్ లో భారీ హిట్ బిగిల్ లో ఈమె కీలక పాత్ర చేస్తే అదే తమిళ్ లో 96 తెలుగులో రీమేక్ జాను ఇంకా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో క్యూట్ గా కనిపించి అలరించింది. ఇది ఈమెకి ఒక సైడ్ అయితే సోషల్ మీడియాలో ఆమె నుంచి మరో సైడ్ కూడా ఉంది.

కాగా వర్ష సోషల్ మీడియాలో ఎప్పటికపుడు యమా యాక్టీవ్ గా ఉంటుంది. తాను కన్నడ అమ్మాయి కావడంతో తన హోమ్ ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంకి వీరాభిమాని. మొన్నామధ్య చెన్నైతో మ్యాచ్ సమయంలో ఆమె పోస్ట్ ఒకటి మంచి వైరల్ గా కూడా మారింది. కాగా ఇవే కాకుండా కొన్ని కొన్ని సార్లు మంచి చిలిపి పోస్ట్ లు కూడా ఈమె చేస్తుంది.
మరి ఇలా తన నుంచి ఓ పోస్ట్ తెలుగు యువతలో వైరల్ గా మారింది. ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఇక బ్లాక్ మినీ స్కర్ట్ వేసుకొని తన తొడలు కనిపించేలా కొన్ని పిక్స్ షేర్ చేసుకుంది. ముందే మన తెలుగు యువతకి కొంచెం వెటకారం ఎక్కువ కదా సినిమాలు ఎక్కువ చూస్తుంటారు అలానే పుసుక్కున ఇలాంటి ఫొటోస్ చూస్తే వెంటనే ప్యాంటు వేసుకోడం మర్చిపోయావా.. అని అడిగినా అడిగేస్తారు.
అందుకే ముందే ఈమె అలెర్ట్ అయ్యిపోయి తన మీద తానే సెటైర్ వేసుకునేలా అది దా సర్ప్రైజూ అంటూ ప్యాంటు ఎక్కడ? అనే లాంటి సిల్లీ ప్రశ్నలు అడగొద్దు ప్లీజ్.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నా ప్యాంటు ఎక్కడ ఉంది అని అడగొద్దు పంత్ ఇంగ్లీష్ లో PANT లక్నో సూపర్ జెంయింట్స్ లో ఉన్నాడు అంటూ తెలిపింది.
దీనితో ఇది చూసిన నెటిజన్స్ అంతా ఈమె సెన్సాఫ్ హ్యూమర్ దెబ్బకి భలే నవ్వుకుంటున్నారు. దీనితో తన నుంచి ఈ క్రేజీ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. ఇక ఈ యంగ్ బ్యూటీ గత ఏడాదిలో హీరో సందీప్ కిషన్ సరసన ఊరు పేరు భైరవ కోన సినిమాలో మెరిసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేనట్టు ఉన్నాయి కానీ ఈ తరహా పోస్ట్ లతో మాత్రం తెలుగు యువతకి దగ్గర గానే ఉంటుంది. మరి తెలుగులో ఎప్పుడు మళ్ళీ కనిపిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











