నాడు జగ్గుబాయ్‌తో ఘాటు రొమాన్స్.. నేడు 42 ఏళ్ల వయసులో హాట్ షో.. ఈ బ్యూటీ గుర్తుందా?

గాయం సినిమా పేరు చెబితే చాలు చాలా మందికి అందులో జగపతి బాబు ఓ అమ్మాయితో చేసిన రొమాన్స్ యే గుర్తొస్తుంది. ముఖ్యంగా ఎందుకమ్మ ప్రేమా.. ప్రేమా.. అంటూ సాగే ఆ పాటను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్రంలో వీరిద్దరూ చేసిన ఘాటు రొమాన్స్ ను మరో పది కాలాల పాటు గుర్తుంచుకుంటారు అంతా. అయితే ఈ చిత్రం జగ్గూ బాయ్ తో నెక్స్ట్ లెవెల్ రొమాన్స్ చేసిన హీరోయిన్ మరెవరో కాదు... విమలా రామన్. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె 2006లో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పోయి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సంవత్సరమే మలయాళంలో టైం అనే సినిమా చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ తమిళ, మలయాళ భాషల్లో రచ్చ చేసింది. 2010లో ఆప్తరక్షక అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో మాత్రం ముందుగా అంటే 2009లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఎవరైనా ఎపుడైనా సినిమా చేసింది.

Heroine Vimala Raman Mesmerizing Look Photos Goes Viral

మొదటి సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గాయం 2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేకంటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జున వంటి చిత్రాల్లోనూ అద్భుతమైన నటన కనబర్చి అందరినీ ఆకట్టుకుంది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేసింది. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ అతి చిన్న డ్రెస్ వేసుకుని అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు చేస్తున్నారు. అందంగా ఉన్నారు, అదిరిపోయారు అంటూ చెప్పుకువస్తున్నారు. మీ అందాలు చూసి తట్టుకోలేకపోతున్నాం.. అంటూ వివరిస్తున్నారు. ఫ్లోరల్ ప్రింట్ తో ఉన్న డ్రెస్ లో విమలా రామన్ అందాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.

ప్రస్తుతం విమలా రామన్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. లేటు వయసులో కూడా చాలా ఘాటైన అందాలు కనిపిస్తుండడంతో కుర్రకారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులోనూ ఇరవై ఏళ్ల వయసులా కనిపిస్తున్న ఈమె ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి. పుల్ గా ఎంజాయ్ చేసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X