42 ఏళ్ల వయసులో బికినీ.. స్విమ్మింగ్ పూల్‌లో సీక్రెట్‌గా శ్రీకాంత్ హీరోయిన్ రచ్చ.. ఈ పిక్స్ చూశారా?
విమలా రామన్.. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈమె... 2006లో సినీ రంగంలో అడుగు పెట్టింది. పోయి అనే తమిళ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఏడాదే మలయాళంలో టైం అనే సినిమా చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ తమిళ, మలయాళ భాషల్లో రచ్చ చేసింది. 2010లో ఆప్తరక్షక అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోనూ కాలు మోపింది. 2009లో ఎవరైనా ఎపుడైనా అనే సినిమాలో వరుణ్ సందేశ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గర అయింది.
ఆ తర్వాత గాయం 2, రంగ ది దొంగ, రాజ్, చట్టం, కులుమనాలీ, నువ్వా నేనా, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఓం నమో వేకంటేశాయ, రుద్రంగి, గాండీవదారి అర్జున వంటి చిత్రాల్లోనూ మెరిసింది. రంగ ది దొంగ సినిమాలో అయితే శ్రీకాంత్ మేక సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా శ్రీకాంత్ హీరోయిన్ గా మారిన ఈమె ఆ తర్వాత అనేక మంది హీరోల సరసన చేసింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేధికగా పోస్ట్ చేసింది. అందులో బికినీ వేసుకుని రచ్చ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో దిగి మరీ తన సోకులను ఆరబోసింది. ఎవరూ లేని స్విమ్మింగ్ పూల్ లో దిగిన విమలా రామన్.. చక్కగా ఒక్కతే ఎంజాయ్ చేస్తోంది.
బ్లాక్ కలర్ బికినీలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది. అలాగే మెడలో ఓ సింపుల్ చైన్ వేసుకుని సూపర్ హాట్ లుక్ లో కనిపిస్తోంది. విమలా రామన్ షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె తడి అందాలు చూసిన ప్రతీ ఒక్కరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అదే విషయాన్ని కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా అందంగా ఉన్నావు, అదిరిపోయావు, సూపర్ హాట్, ఈ ఏజ్ లోనే ఇలా ఉన్నావంటే 20 ఏళ్ల వయసులో ఇంకా ఎలా ఉండేదానివో అంటూ రాసుకొస్తున్నారు. విమలా రామన్ షేర్ చేసిన హాట్ పిక్స్ ను మీరు కూడా ఓసారి చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











