Vithika Sheru: పట్టుచీరలో పగడపు బొమ్మ.. వితికా శేరు అందాల ఆరబోత చూస్తే షాకే!

హీరో వరుణ్ సందేశ్ భార్య, హీరోయిన్ వితికా శేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలోని భీమవరంలో పుట్టిన ఈ క్యూట్ బ్యూటీ చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చింది. 15వ ఏట కన్నడ సినీ రంలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అదరగొటట్టింది. అంతు ఇంతు ప్రీతి బంతు అనే సినిమాలో ఓ పాత్ర చేసింది. ఇది తెలుగులో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో కలర్స్ స్వాతి పోషించిన పాత్ర. ఆ తర్వాత ఏడాది ఉల్లాస ఉత్సాహ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది.

అదే ఏడాది తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. ప్రేమించు రోజుల్లో, సందడి వంటి సినిమాల్లో కీర్తిగా నటించింది. ఇక ఆ తర్వాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండీ ప్రేమలో మరి, మహాబలిపురం వంటి చిత్రాల్లో నటించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుంది. అలాగే తమిళంలో కూడా ఉయిర్ మోజీ అనే ఓ సినిమాను చేసింది. అయితే పడ్డానండి ప్రేమలో మరి చిత్రంలో తనతోపాటు నటించిన హీరో వరుణ్ సందేశ్ తో వితికా శేరు ప్రేమలో పడింది. ఇలా వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.

Heroine Vithika Sheru Good Looking Saree Photos goes Viral

వితికా శేరు, వరుణ్ సందేశ్ లు జంటగా బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ లో అడుగు పెట్టి అందరినీ అలరించారు. ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్.. వితికాకు బిగ్ బాస్ వల్ల వచ్చింది. ప్రస్తుతం ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్ నడిపించుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అందిస్తుంటుంది.

Heroine Vithika Sheru Good Looking Saree Photos goes Viral

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో పట్టుచీర కట్టుకొని అదిరిపోయింది.ఎల్లో అండ్ గోల్డ్ కలర్ చీర కట్టుకున్న వితికా శేరు గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ బ్యాగింల్స్ వేసుకుంది. పెద్ద జుంకీలు పెట్టుకొని అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. వెనకలా లైటింగ్స్ పెట్టుకొని మరీ వితికా శేరు అద్భుతమైన ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగింది. వితికా ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే వేలల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి.

Heroine Vithika Sheru Good Looking Saree Photos goes Viral

ఈ ఫొటోలతో పాటుగా వితికా శేరు అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా చెప్పింది. పండగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించింది. ఈ చేసిన ఈ పోస్టుకు అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. చాలా బాగున్నావు, లుక్కు అదిరింది, పట్టుచీర కంటే నీవే ఎక్కువగా మెరిసిపోతున్నావంటూ చెప్పుకొస్తున్నారు. దసరా పండగ మొత్తం నీలోనే కనిపిస్తుందని కొందరు.. ఏం అందంరా నాయనా అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X