Vithika Sheru: "పెళ్లైన మూడేళ్లకే ప్రెగ్నెన్సీ.. కానీ మేము ఇప్పటి వరకు పిల్లల్ని కనకపోవడానికి కారణం అదే"
వితికా షేరు... ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే.. హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమంచి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం చాలా హాయిగా గడుపుతున్న ఈ జంటకు పెళ్లి అయి 9 సంవత్సరాలు అవుతోంది. అయితే ఇన్ని ఏళ్లు అవుతున్నా ఈ జంట ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు. అయితే దీనిపై ఇప్పటికే చాలా వార్తలు రాగా.. తాజాగా వితికా షేరు దీని గురించి చెప్పింది. పెళ్లైన ఏడాదికే తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. కానీ ఇప్పటి వరకు తమకు పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏంటో కూడా చెప్పారు. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
2008లో అంతు ఇంతు ప్రీతి బందు అనే సినిమాతో కన్నడ సినీ రంగంలో కాలు మోపిన వితికా షేరు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. హీరోయిన్ గా మారి అద్భుతమైన చిత్రాల్లో కనిపించిన ఈమె 2015లో తన తోటి నటుడు వరుణ్ సందేశ్ తో ప్రేమలో పడింది. అదే ఏడాది ఈ క్యూట్ కపుల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం 30 ఏళ్ల వయసు కల్గిన ఈమె 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. అప్పుడు వరుణ్ సందేశ్ కు కూడా 24 ఏళ్లే. అయితే అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం చాలా సంతోషంగా గడుపుతోంది.

అయితే రెండేళ్ల క్రితమే చెల్లి పెళ్లి చేసిన ఈ క్యూట్ బ్యూటీ.. ఇటీవలే తన భర్త ఇంటిని రీ మాడిఫై చేసి తన బాధ్యతలు తీర్చుకుంది. ఇలా పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ ఓ పద్దతి ప్రకారం ముందుకు వెళ్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాము ఇప్పటికీ పిల్లల్ని కనకపోవడానికి గల కారణాలను వివరించింది. అలాగే ఓ షాకింగ్ న్యూస్ కూడా చెప్పింది. పెళ్లైన మూడేళ్లకే అంటే 2019 మొదట్లో తాము అమెరికాలోనే సెటిల్ అయిపోవాలని అక్కడకు వెళ్లారట. అక్కడే 6 నెలలు ఉండగా.. తనకు గర్భం వచ్చిందట. ఆస్పత్రికి వెళ్తే ఆ విషయం చెప్పగా అంతా సంబురాలు చేసుకున్నారట.
అయితే ఏమైందో తెలియదు కానీ తనకు గర్భస్రావం జరిగిందని వితికా షేరు వెల్లడించింది. ఇక ఆ బాధ నుంచి తేరుకోవడానికి తాము ఇండియా వచ్చేశామని.. ఇక్కడకు వచ్చాకా రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్లినట్లు చెప్పింది. అప్పుడు కూడా మతకు ప్రెగ్నెన్సీ వచ్చిందని.. రెండు నెలలు అవుతుందని అన్నారట. అయితే అమెరికాలో గర్భస్రావం జరిగిందని చెప్పగా.. స్కానింగ్ చేయగా.. బేబీ చిన్న ముక్క లోపలే ఉండడంతో.. మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారని వెల్లడించింది. ఇలా చాలా బాధను చూసినట్లు తెలిపింది.

అయితే ఆ తర్వాత ఏడాదే తాము బిగ్ బాస్ కు వెళ్లడం, చెల్లి పెళ్లి చేయడం, కెరియర్ లో ముందుకెళ్లడం, ఇప్పుడు ఇల్లు బాగు చేసుకోవడం.. ఇలా చాలా మంచి పనులు చేసుకుని.. ఆర్థికంగా స్థిరపడుతున్నట్లు వివరించింది. దేవుడు మేము బాగా సెటిల్ అయ్యాకే పిల్లల్ని ఇవ్వాలనుకున్నాడేమో అందుకే ఇలా చేశాడేమో అని తనకు అనిపిస్తుందని.. మరికొంత ఆర్థికంగా స్థిరపడగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు వివరించింది. తమకు పుట్టిన పిల్లల్ని చక్కగా చూసుకోవాలంటే కచ్చితంగా డబ్బు కావాల్సిందేనని అందుకే ఆర్థికంగా సెటిల్ అవ్వడంపైనే దృష్టి పెట్టినట్లు వివరించింది. అయితే గర్భం దాలిస్తే మాత్రం తానే చాటింపు వేసి మరీ అందరికీ చెబుతానని క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











