HIT హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఇక సినిమాలకు గుడ్ బై? అసలేం జరిగిందంటే?
టాలీవుడ్‌లో గట్టిగా పాగా వేయాలని భావిస్తున్నారు యంగ్ బ్యూటీ కోమలీ ప్రసాద్. హిట్ 2, హిట్ 3 సినిమాలలో పోలీస్ ఆఫీసర్‌గా అలరించిన కోమలీ ప్రసాద్ యాక్షన్ సీన్స్‌తో గ్లామర్ రోల్స్‌లోనూ మెప్పించగలనని నిరూపించారు. డాక్టర్ చదివిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమలీ ప్రసాద్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు? అసలేం జరిగింది? ఈ వివరాల్లోకి వెళితే..
సీతాదేవి సినిమాతో ఎంట్రీ
చిత్రసీమలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని కొందరు నటీనటులు చెబుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఆల్రెడీ మెడిసిన్ చదివి ఆ తర్వాత నటనా రంగంలో అడుగుపెట్టారు. డాక్టర్ రాజశేఖర్, సాయిపల్లవి, మీనాక్షి చౌదరి, శ్రీలీల తదితరులు మెడిసిన్ చదివి సినిమాల వైపు వచ్చారు. ఈ కోవలోకే వస్తారు కోమలీ ప్రసాద్. 2016లో సీతాదేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోమలీ ప్రసాద్.. నెపోలియన్, రౌడీబాయ్స్, హిట్ 2, సెబాస్టియన్ పీసీ 524, హిట్ 3 వంటి సినిమాలలో నటించి మెప్పించారు.

నాన్న కోసం మెడిసిన్
తాను డెంటల్ సైన్స్ పూర్తి చేసి డెంటిస్ట్‌గా కూడా పనిచేశానని.. సినిమాల్లోకి వస్తానంటే మా నాన్న గారు ఒప్పుకోనని చెప్పారని కోమలీ ప్రసాద్ తెలిపారు. అయితే చేతిలోకి సర్టిఫికెట్ వచ్చాకే ఏమైనా చేయమని ఆయన తెలిపారని, చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్‌గా ఉంటుందని నాన్న చెప్పేవారని ఆమె వెల్లడించారు. ఆయన కోరిక మేరకు డాక్టర్ పూర్తి చేసిన తర్వాతే సినిమాల్లోకి వచ్చానని, అందువల్ల ఆలస్యం కూడా జరిగిందని కోమలీ పలు ఇంటర్వ్యూలలో ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో మాస్టర్స్ చేయాల్సిన సమయంలో సీతాదేవి సినిమాలో ఛాన్స్ దక్కడంతో .. అప్లికేషన్ ఫారం కూడా చించేసి సినిమాల్లోకి అడుగుపెట్టానని వెల్లడించారు.
కోమలీ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్
కోమలీ ప్రసాద్‌లో నటి, డాక్టర్ మాత్రమే కాదు క్రీడాకారిణి కూడా ఉన్నారు. జాతీయ స్థాయి అథ్లెట్‌గా, క్లాసికల్ డ్యాన్సర్‌గానూ ఆమె రాణించారు. రాష్ట్ర స్థాయిలో కోకో, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించారు. అథ్లెట్ అనుభవం వల్లే హిట్ 3 సినిమాలో ఎస్పీ వర్షగా కోమలీ అదరగొట్టారు. వర్ష పాత్ర శారీరకంగా, మానసికంగా ఛాలెంజ్‌గా అనిపించిందని ఇందుకోసం జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరున్న అనిల్ అనే కోచ్ వద్ద శిక్షణ తీసుకుని మరింత రాటుదేలారు. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఎప్పటికైనా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలో నటించాలనది తన కలగా చెప్పారు.
కోమలీ ప్రసాద్ బ్రేకప్
ఇక అందరి హీరోయిన్ల మాదిరిగానే కోమలీ ప్రసాద్‌పైనా అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాను ఇప్పటికే ఒకరితో ప్రేమలో పడ్డానని, అతనితో బ్రేకప్ కూడా అయ్యిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను సింగిల్ అని.. పైగా డేటింగ్ అంటే తనకు ఏమాత్రం నచ్చదని, సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని కోమలీ తెలిపారు. ఒక పూట బిర్యానీ తినిపిస్తూ.. నన్ను నవ్వించే వ్యక్తి దొరికితే అతనిని పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను చెప్పారు కోమలీ ప్రసాద్.
తిరిగి తెల్లకోటులో
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కోమలీ ప్రసాద్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో తెల్లకోటు ధరించిన ఆమె .. అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, డాక్టర్ కోమలీ రాబోతుందని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. మీరు సినిమాలకు ఇక దూరం అవుతారా? డాక్టర్‌గానే కొనసాగుతారా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











