‘సైలెన్స్’గా అమెరికాకు హీరోయిన్ అనుష్క... మొత్తం అక్కడే!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క సెలెక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతోంది. 'భాగమతి' తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న స్వీటీ త్వరలో 'సైలెన్స్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మాధవన్ లీడ్ రోల్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపనున్నారట. హాలీవుడ్ యాక్టర్లు ఎక్కువ మంది నటించబోయే తెలుగు సినిమా కూడా ఇదే అని అంటున్నారు.

కీలక పాత్రలో హాలీవుడ్ యాక్టర్స్
సినిమాలో ఎక్కువగా హాలివుడ్ షేట్స్ ఉండటం, స్క్రిప్టు డిమాండ్ మేరకు ముఖ్యమైన పాత్రలకు హాలీవుడ్ నటులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

బరువు తగ్గిన అనుష్క
బరువు తగ్గడంలో భాగంగా అనుష్క నేచురోపతి ట్రీట్మెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె తన తర్వాతి సినిమా షూటింగులో పాల్గొనబోతున్నారు. తెలుగు, తమిళ ద్విబాషా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేయనున్నారు.

కోన వెంకట్, గోపీ
‘సైలెంట్' చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ రచయితలుగా పని చేశారు. దాదాపు రెండు సంవత్సరాలు ఈ సినిమా స్క్రిప్టు మీద వర్కౌట్ చేశారట. సినిమా మొత్తం యూఎస్ఏలో చిత్రీకరణ జరుగుతుందని, పలువురు హాలీవుడ్ యాక్టర్లను ఇందులో తీసుకుంటున్నట్లు తెలిపారు.

షూటింగ్ ఎప్పుడంటే..?
2019 జనవరిలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం అనుష్క తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్లో ఉన్నట్లు సమాచారం. గతంలో అనుష్క-మాధవన్ కలసి సుందర్ సి దర్శకత్వంలో ‘రెండు' అనే చిత్రంలో నటించారు. దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











