అక్కడ అసభ్యంగా తాకుతూ... పబ్లిక్‌గా బాలయ్య హీరోయిన్‌కు వేధింపులు
భారతదేశంలో సినిమా ఒక మతమైతే.. తారలు దేవుళ్లు. వారిని ఇలవేల్పులుగా, ఆడయాలు కట్టి మరి పూజిస్తుంటారు అభిమానులు. తమ అభిమాన నటులను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిని చూస్తే చాలు జన్మధన్యమైందని అనుకునేవారు ఎందరో. స్టార్స్ నుంచి అభిమానులు కోరుకునేది ఓ ఆటోగ్రాఫ్, ఓ చిన్న సెల్ఫీ మాత్రమే. అయితే కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటుతోంది. ముఖ్యంగా.. హీరోయిన్ల విషయంలో ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పాటు వెకిలి చేష్టలు చేస్తున్నారు. దాంతో పబ్లిక్‌లోకి రావాలంటేనే స్టార్స్ వణికిపోతున్నారు. తాజాగా హీరోయిన్ హనీరోజ్‌కు పబ్లిక్‌గా ఊహించని ఘటన ఎదురైంది. ఈ వివరాల్లోకి వెళితే..
వీరసింహారెడ్డితో గుర్తింపు
14 ఏళ్ల చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టి చిన్నాచితకా పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్. 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు వారిని పలకరించారు. అయితే తెలుగులో అంత గుర్తింపు , అవకాశాలు లేకపోవడంతో తన మాతృభాషలోనే అవకాశాలు వెతుక్కున్నారు. చాలాకాలం తర్వాత 2023లో నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డిలో హీరోయిన్‌గా నటించారు. ఇందులో బాలయ్యకు తల్లిగా, ప్రియురాలిగా నటించారు. భారీ అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న హనీరోజ్‌కు ఆ తర్వాత తెలుగులో ఎలాంటి అవకాశాలు రాకపోవడం గమనార్హం.

షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో బిజీ
స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నప్పటికీ హనీరోజ్‌కు అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ నిత్యం ఓపెనింగ్స్, ఇతర కార్యక్రమాలకు హాజరవుతూ భారీగా సంపాదిస్తోంది. ప్రస్తుతం హనీరోజ్ చేతిలో రేచల్ అనే మూవీ తప్పించి ఏం లేదు. గతేడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా విడుదల అవుతుందని అంతా అనుకున్నప్పటికీ ఆలస్యమైంది. తనకు అవకాశాలు రాకపోవడంపై హనీరోజ్ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ ఇండస్ట్రీకి నేను అక్కర్లేదనుకుంటా.. కానీ పరిశ్రమను మాత్రం నేను వదలడం లేదు. ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసుకుని ది బెస్ట్ ఇవ్వాలనే కష్టపడతానని హనీరోజ్ అన్నారు.
వ్యాపారవేత్త వేధింపులు
కొద్దిరోజుల క్రితం తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. అతని ఆఫర్‌ను తిరస్కరించినందుకే ఇలా నాపై కక్ష సాధిస్తున్నాడని ఆరోపించారు. దాంతో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలిచారు. తాజాగా హనీరోజ్‌కు పబ్లిక్ ప్లేస్‌లో చేదు అనుభవం ఎదురైంది.
హనీరోజ్‌కు చేదు అనుభవం
కేరళలోని ఓ ప్రాంతంలో ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసేందుకు హనీరోజ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఆమె వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున పోటెత్తడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగివెళ్తూ వేదిక మీద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు హనీరోజ్. అనంతరం సెల్ఫీలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే కొందరు ఆకతాయిలు సెల్పీ తీసుకునే వంకతో ఆమెను అసభ్యంగా తాకారు. నడుముపై చేయి వేస్తూ ఇబ్బందిపెట్టారు. ఇది గమనించిన హనీరోజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆకతాయిలపై మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications
















