ఏది పడితే అది లోపల పెట్టుకుంటారా .. బాలయ్య హీరోయిన్ చిలిపి చేష్టలపై ట్రోలింగ్
అదేంటో గానీ కొందరు హీరోయిన్లకు చేతిలో ఒక్క సినిమా కూడా ఉండదు కానీ వారికి మాత్రం బయట విపరీతంగా పాపులారిటీ, స్టార్‌డమ్ ఉంటుంది. ఇంకొందరు మాత్రం వరుసగా హిట్స్ అందుకుంటున్నా బయట వాల్యూ దొరకదు. ఈ మొదటి కేటగిరీ కిందకే వస్తారు కేరళ కుట్టి హనీరోజ్. ముద్దుగా బొద్దుగా ఉండే ఈమె తన స్మైల్‌తోనే ఫిదా చేసేస్తారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హనీరోజు.. తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే :
హనీరోజ్ పూర్తి పేరు హనీరోజ్ వర్గీస్. 1991 సెప్టెంబర్ 5న కేరళలో జన్మించిన ఆమె డిగ్రీ వరకు చదువుకున్నారు. 14 ఏళ్ల చిన్న వయసులోనే హనీరోజ్ ముఖానికి మేకప్ వేసుకున్నారు. 2005లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ అనే సినిమాలో నటించారు. 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అయితే తెలుగులో అంత గుర్తింపు , అవకాశాలు లేకపోవడంతో తమిళ్, మలయాళం ఇండస్ట్రీలపైనే పెట్టారు హనీరోజ్.

త్రివేండ్రం లాడ్జి, హోటెల్ కాలిఫోర్నియా, థ్యాంక్యూ, యూ టూ బ్రూటస్ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చి మలయాళంలో స్టార్ హీరోయిన్‌ను చేశాయి. అగ్రనటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, జయరామ్, దిలీప్‌ల సరసన నటించే చాన్స్ కొట్టేశారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తెలుగులో హనీరోజ్‌కు అవకాశం దక్కింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డిలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు.
ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్లను తన అందంతో గిలిగింతలు పెట్టింది. వీరసింహారెడ్డి తర్వాత హనీరోజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్లు, సబ్‌స్క్రైబర్లు పెరిగారు. టాలీవుడ్‌ని హనీరోజ్ దున్నేస్తుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఒక్కటంటే ఒక్క ఛాన్స్ కూడా ఆమెకు రాలేదు. అయినప్పటికీ ఓపెనింగ్స్ , బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు హనీరోజ్.
నిత్యం ఎక్కడో , ఓ చోట ఖచ్చితంగా ఓపెనింగ్‌లో పాల్గొనడం దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం హనీరోజ్ దినచర్యగా పెట్టుకున్నట్లుగా ఉంది. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లను రెచ్చగొట్టడంలోనూ ఈమె ముందుంటుంది. తాజాగా హనీరోజ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రీన్ టీనో, లెమన్ టీనో తాగుతున్న ఆమె పక్కనే ఉన్న ఏదో పువ్వుని తీసుకుని కళ్లలో పెట్టుకోబోతుండగా అది కాస్తా ఆమె కంటికి గుచ్చుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏది పడితే అది కళ్లలో పెట్టుకుంటే ప్రమాదమని నెటిజన్లు ఆమెకు చురకలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











