ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు.... బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

అందం, అభినయం దండిగా ఉన్నప్పటికీ కొంతమంది నటీనటుల కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఇక మరో కేటగిరి విషయానికి వస్తే.. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రావు. ఈ కోవలోకే వస్తారు మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ హీరోయిన్‌.. నటిగా తనను తాను నిరూపించుకుంది. కానీ ఆమెకు అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా ఇండస్ట్రీలోని పరిస్ధితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు హనీరోజ్. ఈ వివరాల్లోకి వెళితే..

14 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా
హనీరోజ్ పూర్తి పేరు హనీరోజ్ వర్గీస్. 14 ఏళ్ల చిన్న వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టి చిన్నాచితకా పాత్రలు చేస్తూ వచ్చారు. 2005లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన బాయ్‌ఫ్రెండ్ అనే సినిమాలో నటించారు. 2008లో శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో తెలుగు వారిని పలకరించారు. అయితే తెలుగులో అంత గుర్తింపు , అవకాశాలు లేకపోవడంతో తమిళ్, మలయాళం పరిశ్రమలకు పరిమితమై అక్కడ సక్సెస్ అందుకున్నారు.

Honey Rose says Malayalam film industry doesn t need her

మలయాళంలో స్టార్‌గా
త్రివేండ్రం లాడ్జి, హోటెల్ కాలిఫోర్నియా, థ్యాంక్యూ, యూ టూ బ్రూటస్ సినిమాలతో హనీరోజ్.. స్టార్ హీరోయిన్‌ అయ్యారు. అగ్రనటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్ గోపి, జయరామ్, దిలీప్‌ల సరసన ఆడిపాడారు. ఇక చాలా రోజుల తర్వాత తెలుగులో హనీరోజ్‌కు అవకాశం దక్కింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డిలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఇందులో బాలయ్యకు ప్రియురాలిగా, తల్లిగా నటించి మెప్పించారు.

హనీరోజ్‌కు వేధింపులు
ఇక గతేడాది తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేస్తున్నాడని హనీరోజ్ చేసిన వ్యాఖ్యలు మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. అతని ఆహ్వానాన్ని తిరస్కరించడంతో ఆయన నాపై కక్ష సాధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ఈ వేధింపులు భరిస్తున్నానని, కానీ ఇటీవల ఆయన టార్చర్ ఎక్కువ కావడంతో ఇక స్పందించాల్సి వచ్చిందని హనీరోజ్ అన్నారు. దాంతో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు. తాజాగా ఇండస్ట్రీలోని పరిస్థితులపై హనీరోజ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

రెండేళ్లుగా ఖాళీగానే
2023లో వరుస సినిమాలతో హల్‌చల్ చేసిన హనీరోజ్‌కు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్నప్పటికీ ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత హనీరోజ్ ప్రస్తుతం రేచల్ అనే మూవీలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనందిని బాలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు.

Take a Poll

ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు
ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హనీరోజ్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ సినీ పరిశ్రమకు నేను అక్కర్లేదు.. కానీ ఈ ఇండస్ట్రీని నేను మాత్రం వదలడం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్లు అవుతోంది.. నాకు ఎన్నో అవకాశాలు రావాలని, బిజీగా ఉండాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఉత్తమ్ చిత్రాలను ఎంపిక చేసుకుని ది బెస్ట్ ఇవ్వాలనే కష్టపడతా. దర్శకుడు వినాయన్ గారు ముందు నుంచి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు అని హనీరోజ్ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: honey rose movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X