స్టార్ హీరోతో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆయేషా ఖాన్..ఇకనైనా హాట్ బాంబ్ దశ తిరిగేనా?
టాలీవుడ్ సినిమా దగ్గర ఎప్పుడూ హీరోయిన్స్ కి కొదవ ఉండదు అని తెలిసిందే. అలా ఇప్పుడు కూడా తెలుగు సినిమా దగ్గర హీరోయిన్స్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పరిచయం అవుతూ వస్తున్న హీరోయిన్స్ లో ఎవరు ఎంతమేర క్లిక్ అయ్యారు ఎలాంటి క్రేజ్ ని సొంతం చేసుకున్నారు అనేది కూడా ముఖ్యంగా కనిపిస్తుంది.
అలా రీసెంట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర పరిచయం అయ్యిన కొందరు యంగ్ హీరోయిన్స్ సెన్సేషన్ ని సెట్ చేశారు. అయితే కొత్తగా వచ్చిన అమ్మాయిల్లో చాలా మంది హీరోయిన్స్ గా మెరిశారు కానీ కొందరు మాత్రం హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్, అంతకు మించి హాట్ ఐటెం సాంగ్స్ లో కూడా కనిపిస్తున్న వారు ఉన్నారు. అలా వచ్చిన కొంత సమయంలోనే యూత్ ని రెచ్చగొట్టేసింది ఓ యంగ్ అండ్ హాట్ బ్యూటీ.

వయస్సులో చాలా చిన్నదే అయినప్పటికీ టాలీవుడ్ లో మాత్రం మంచి హాట్ అండ్ బోల్డ్ షోతో యువతని జస్ట్ కొన్ని సినిమాలతోనే షేక్ చేసింది. మరి ఆ హాట్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ ఎవరో కాదు హాట్ చిక్ ఆయేషా ఖాన్. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాలే చేసింది కానీ యువతలో కావాల్సిన అటెన్షన్ ని తెచ్చుకుంది. అయితే కెరీర్ పరంగా ఇది అంత ప్లస్ కాలేదు.
కేవలం కొన్ని పాత్రలు హాట్ ఐటెం సాంగ్స్ వరకు మాత్రమే తెలుగులో ఆమెకి ఆఫర్స్ వస్తున్నాయి. సరే ఇది బాగానే ఉంది కానీ ఇపుడు మాత్రం ఓ బిగ్ ఆఫర్ ని ఈమె పట్టేసినట్టుగా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా వీటి ప్రకారం ఈమెకి ఓ టాలీవుడ్, బాలీవుడ్ కంబైన్డ్ ఆఫర్ వచ్చినట్టుగా వినిపిస్తుంది. కాగా ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర తెలుగు దర్శకులు హిందీ హీరోలు వర్క్ చేయడం కామన్ గా కొనసాగుతుంది.
అలా చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జాట్" లో ఆయేషా ఖాన్ ఆఫర్ దక్కించుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ సెన్సేషనల్ హీరో సన్నీ డియోల్ టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమాలో చాలా మందే ఫీమేల్ లీడ్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా వారితో పాటుగా ఆయేషా ఖాన్ కూడా కనిపిస్తుంది అని తెలుస్తుంది.

మరి ఈ సినిమాలో ఈమె కీలక పాత్ర చేస్తుందో లేక అందులో కూడా ఐటెం సాంగ్ లోనే కనిపిస్తుందో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. వచ్చింది పెద్ద ఆఫర్ నే కానీ అది ఆమెకి ఎంతమేర పనికొస్తుందో చూడాలి. కాగా ఈ ఏడాదిలో ఆయేషా ఖాన్ తెలుగులో "ఓం భీం బుష్", "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" అనే రెండు సినిమాల్లో కనిపించింది.
ఓం భీం బుష్ లో సాలిడ్ గ్లామర్ రోల్ చేసి అందరినీ షాక్ కి గురి చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. కానీ విశ్వక్ సేన్ తో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో ఐటెం సాంగ్ చేసింది కానీ రిలీజ్ కి ముందు ఆమె సాంగ్ సినిమాలో బాగానే హైలైట్ అయ్యింది కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆమె సాంగ్ వేస్ట్ అయ్యిపోయింది అన్నట్టుగా టాక్ వచ్చింది. మరి చూడాలి ఈ బిగ్ ఆఫర్ అయినా ఆమెకి బ్రేక్ ఇచ్చి దశ మారుస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











