ఓ రేంజ్ లో హీటెక్కిస్తున్న కీర్తి సురేష్ .. బాలీవుడ్ ఎంట్రీ అరాచకం అంతే..
ఒకప్పుడు ఉత్తరాది సినిమా నుంచి పలువురు హీరోయిన్స్ సౌత్ లో పరిచయం అయ్యి పాగా వేసే వాళ్ళు . అలాగే బాలీవుడ్ లేదా నార్త్ నుంచి ఇప్పటికీ కూడా చాలా మంది మన సైడ్ వస్తూనే ఉంటారు. వీరికి డిమాండ్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది కానీ సౌత్ నుంచి వెళ్లి దక్షిణాదిన పాగా వేసిన హీరోయిన్స్ ఎవరు అంటే చాలా తక్కువ. మహా అయితే వేళ్ళ మీద లెక్క పెట్టేసే అంత తక్కువ మంది కూడా ఉండరు.
ఇలా సౌత్ నుంచి వెళ్లి సెటిల్ అయ్యిన వారు మాత్రం చాలా తక్కువే ఉంటారని చెప్పాలి. అయితే దక్షిణాది నుంచి ఎవరూ వెళ్లడం లేదా అంటే వెళుతున్నారు కానీ మన దగ్గర క్లిక్ అయ్యినట్టుగా అక్కడ వాళ్ళ పప్పులు ఉడకడం లేదు. దీనితో మళ్ళీ దక్షిణాదికే వచ్చి తెలుగు , తమిళ సినిమాలు చేసుకుంటున్నారు.

కాగా ఇపుడు మరో టాప్ బ్యూటీ అయితే హిందీ సినిమాలోకి వెళ్లి సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు. మన తెలుగు సహా తమిళ్ సినిమాలో స్టార్ స్టేటస్ టచ్ చేసిన టాప్ బ్యూటీ మహానటి కీర్తి సురేష్. ఇపుడు కీర్తి సురేష్ కి తెలుగులో సహా తమిళ్ లో కూడా చాలా తక్కువ ఆఫర్లు ఉన్నా ఆమెకి రావడం లేదు. దీనితో సౌత్ సినిమా నుంచి నార్త్ సినిమాపై తాను కన్నేసింది.
కాగా అక్కడ కూడా సౌత్ సినిమా రీమేక్ తోనే వెళుతుండగా కీర్తి సురేష్ ఆ సినిమా పైనే అన్ని అసలు పెట్టుకుందని చెప్పాలి. కాగా ఆ చిత్రమే యంగ్ హీరో వరుణ్ ధావన్ తో నటించిన భారీ యాక్షన్ చిత్రం "బేబీ జాన్". ఈ చిత్రం దళపతి విజయ్ "తేరి" కి రీమేక్ గా తెరకెక్కించగా ఈ సినిమాలో కీర్తి సురేష్ బోల్డ్ షోతో రెచ్చిపోతుంది అని ఓ టాక్ అప్పట్లోనే వచ్చింది.

ఇపుడు సీన్ కట్ చేస్తే అదే నిజం అయ్యింది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన కొన్ని విజువల్స్ చూసి అంతా షాకవుతున్నారు. కీర్తి సురేష్ పై బీచ్ దగ్గర కొన్ని ఫోటోలు ఓ రేంజ్ లో హాట్ షోలో కనిపిస్తున్నాయ్. ఇది వరకు ఎప్పుడు చూడని యాంగిల్ లో కీర్తి సురేష్ ఈ సినిమాలో తన హాట్ షోని ప్రదర్శించింది. ఇవి చూసిన ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ ఇవి నిజంగా కీర్తి సురేష్ ఫొటోలేనా అన్న రేంజ్ లో అవాక్కవుతున్నారు.
ఈ మధ్య అంతా ఆఫ్ లైన్ లో చాలా పిక్స్ ని షేర్ చేయడంతో ఇదంతా తన బాలీవుడ్ ఎంట్రీ కోసమే అని చాలా మంది అనుకున్నారు. ఇపుడు వాటిని నిజం చేస్తూనే తన బాలీవుడ్ ఎంట్రీకి తన అందాల అరాచకం అంటే ఏంటో చూపించింది అని చెప్పాలి. ఇప్పటికి మాత్రం ఈ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











