భూమిక‌ను నిర్ధాక్షిణ్యంగా తీసేసిన బ్లాక్‌బస్టర్ మూవీ ఎంటో తెలుసా? లేకపోతే ఇండస్ట్రీనే..!

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఇప్పుడు పరిచయం అయ్యిన కొన్ని సినిమాలతోనే ఫుల్ ఫామ్ లోకి వచ్చే హీరోయిన్స్ కొంతమంది కనిపిస్తారు. వచ్చిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం వేరు అలా వచ్చిన అవకాశాలతో హిట్స్ కొట్టడం వేరు అని చెప్పాలి. అలా ఇప్పుడు వరకు తెలుగు సినిమాలో చాలా మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. కానీ దాదాపు అందరి స్టార్స్ తో హిట్స్ కొట్టిన హీరోయిన్స్ మాత్రం తక్కువే కనిపిస్తారు.

ఇలా ఒకప్పుడు సౌత్ సినిమా దగ్గర వరుస భారీ హిట్స్ ఒకో హీరోతో అందుకొని వారి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ సినిమాల్లా మార్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అప్పటి హీరోయిన్ భూమిక చావ్లా అని చెప్పొచ్చు. కాగా భూమిక ఒకప్పుడు తెలుగులో సూపర్ సక్సెస్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా వుంది. కాగా అప్పట్లోనే ఉన్న ఫామ్ చూసి మరిన్ని ఆఫర్స్ వచ్చాయి.

How Bhumika missed offer to Kareena Kapoor in Jab We Met Here is reason

కానీ ఆ సమయంలోనే భూమిక ఎదుర్కొన్న పలు చేదు ఘటనలు కూడా ఉన్నాయట. అలా ఆమె వదులుకున్న ఓ బాలీవుడ్ ఆఫర్ కోసం ఆమె ఇటీవల వెల్లడించినట్టు తెలుస్తుంది. బహుశా 2007 సంవత్సరంలో బాలీవుడ్ లో కేవలం 15 కోట్ల బడ్జెట్ తో వచ్చి 50 కోట్లకు పైగా వసూళ్లు అందుకొని అయ్యిన ఓ రొమాంటిక్ సినిమా ఆఫర్ ఆమె మిస్ చేసుకుందట.

కాగా ఆ సినిమానే ప్రముఖ హీరో షాహిద్ కపూర్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన చిత్రం "జబ్ వీ మెట్" అట. ఆ సినిమాకి మొదటిగా హీరోయిన్ గా తననే ఎంపిక చేసారు అని కానీ తర్వాత ఎందుకో తన స్థానంలో కరీనా కపూర్ ని తీసుకున్నారని బాలీవుడ్ లో భూమికకి ఎదురైన చేదు అనుభవం కోసం తెలిపింది.

How Bhumika missed offer to Kareena Kapoor in Jab We Met Here is reason

కానీ అప్పుడుకే తనకు పవన్ తో ఖుషి, మహేష్ బాబుతో ఒక్కడు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి మెమోరబుల్ హిట్స్ అందుకున్నాను సో ఆ ఆఫర్ పోయినా పెద్దగా బాధ పడలేదు అన్నట్టు తెలిపింది. ఇలా బాలీవుడ్ లో ఒకప్పుడు పాగా వేయాల్సిన హీరోయిన్ భూమిక అక్కడ ఆఫర్ వదులుకుంది.

ఇక కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరం అయ్యిన భూమిక తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి పలు సపోర్టింగ్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది.అయితే చాలా కాలం తర్వాత తెలుగులో అల్లరి నరేష్ లడ్డు బాబు సినిమాతో కనిపించింది కానీ అది అంత హిట్ కాలేదు. తర్వాత మరి నాని మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లో మంచి బ్రేక్ అందుకుంది. ఇలా రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు అనేక సినిమాలు చేస్తూ మళ్లీ తెలుగు సినిమా దగ్గర అయితే భూమిక బిజీగా మారి పలు ప్రాజెక్టులు చేస్తుంది. అలాగే తమిల్ లో కూడా అరకొర ప్రాజెక్ట్ లు ఆమె చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X