96 కిలోల నుంచి 45 కిలోలకు..బొద్దు గుమ్మగా నుంచి బికినీ సైజ్ వరకు..ఈ బ్యూటీ బరువు ఎలా తగ్గిందంటే?
సినీ పరిశ్రమ అందం చుట్టూ నడిచే రంగం. హీరోల సంగతేమో కానీ హీరోయిన్లు అందంగా ఉంటేనే నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలో ఉంటారు. లేదంటే నాలుగు రోజులకే పెట్టే బేడా సర్దేయాల్సిందే. ఇలా ఫేడ్ అవుట్ అయిన వారు ఎంతోమంది ఉంటారు. కానీ విపరీతంగా బరువు పెరిగినా, లుక్స్‌లో మార్పులు వచ్చినా కష్టపడి మునుపటి చార్మింగ్‌ను సొంతం చేసుకున్నవారు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తుంది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
సినిమాల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసేవారు, సినిమాల్లోకి ఆల్రెడీ ఉన్న వారు సన్నగా మెరుపు తీగలా ఉండాలి, పొట్ట ఉండకూడదని, ఫిగర్ అదిరిపోవాలని సవాలక్ష కండీషన్లు కామన్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇదే సూత్రాన్ని ఇండస్ట్రీలో అమలు చేస్తున్నారు. పరిశ్రమలో హీరోయిన్‌గా ఉన్నన్ని రోజులు వారు పొట్ట కట్టేసుకోవాల్సిందే. ఖచ్చితంగా డైట్, యోగా వంటివి చచ్చినట్లు ఫాలో అవ్వాల్సిందే. కాదు , కూడదు అన్నవాళ్లు ఇండస్ట్రీలో కనిపించరు.

సినీ పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఉన్న నాలుగు రోజులైనా నలుగురి కంట్లో పడి మంచి అవకాశాలు అందుకోవడానికి అమ్మాయిలు కింద మీద పడుతుంటారు. ఏజ్ పెరిగినా, పెళ్లయి , పిల్లలు పుట్టినా అలాంటి భామలపై విపరీతంగా బాడీ షేమింగ్ కామెంట్స్ బాణాల్లో వస్తుంటాయి. ఇటీవల కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడు ఆమె శరీరాకృతిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేశారు. దీనికి అంతేస్థాయిలో స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు చందమామ.
ఇంకొందరు కథ డిమాండ్ చేసిందని బరువు పెరిగి.. తర్వాత వెయిట్ లాస్ కాలేక అవకాశాలను కోల్పోతుంటారు. ఇందుకోసం కఠినమైన డైట్‌లు, సర్జరీలు చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అనుష్క, ఆర్తి అగర్వాల్ వంటి వారి ఉదంతాలు హీరోయిన్లతో పాటు మనకూ గుణపాఠాల వంటివి. అయితే మరో కేటగిరీ అమ్మాయిలు ఉంటారు. వీరు అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. కెరీర్ ఆరంభంలో ఎంతో లావుగా ఉండి.. అసలు హీరోయిన్ మెటీరియలేనా అని అనిపించుకున్న పరిణితీ చోప్రా కేజీలకొద్దీ బరువు తగ్గి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.

ఇదే కోవలోకి వస్తారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ - అమృతా సింగ్‌ల కుమార్తె సారా అలీఖాన్. అందం, అభినయం పరంగా ఆమెకు వంక పెట్టడానికి ఏం లేదు. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్‌లో స్థానం సంపాదించడమే కాదు, పలు అవార్డులు కూడా అందుకున్నారు సారా. కానీ ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇండస్ట్రీలోకి రాకముందు ఆమె ఏకంగా 96 కిలోల బరువు ఉండేవారు. PCOD-పీసీవోడీ (పోలిస్టిక్ ఓవరియాన్ డిసీజ్), ఊబకాయం బారినపడ్డ సారా .. ఎన్నో అవమానాలు, చీత్కారాలు, మాటలు పడ్డారు. ఈ పరిణామాలు ఆమెలో కసిని పెంచాయి.
శరీరాన్ని డీటాక్షిన్ చేసే గ్రీన్ టీ , లెమన్ టీలతో పాటు సమతుల ఆహారం, కార్డియో, యోగా, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి సహజసిద్ధమైన పద్ధతులతో ఏకంగా 40 కిలోలు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుని , నిబద్ధతతో శ్రమిస్తే ఎవరైనా బరువును అదుపులో ఉంచుకోవచ్చని సారి నిరూపించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.


Click it and Unblock the Notifications











