వేట్టయాన్‌లో హీరోయిన్ రోల్ మిస్ చేసుకొన్న స్టార్ ఎవరో తెలుసా? మంజు వారియర్‌కు ఆఫర్ ఎలా అంటే?
జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ వేట్టయన్ ది హంటర్ . ఇది తలైవా కెరీర్‌లో 170వ చిత్రం. దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాలో రజనీ వైఫ్‌గా నటించిన మంజు వారియర్‌కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఒకసారి చూస్తే :
వేట్టయన్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ రీత్యా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తమిళనాడులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.73 కోట్లకు అమ్ముడవగా.. తెలుగులో రూ.17 కోట్లు, కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ రూ.25 కోట్లతో పాటు ఓవర్సీస్‌లో రూ.45 కోట్ల మేర జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌లో వేట్టయన్ రూ.160 కోట్ల బిజినెస్ చేసింది.

అయితే వేట్టయన్ కోసం పాన్ ఇండియా స్టార్స్‌ని దర్శకుడు రంగంలోకి దించాడు. ముఖ్యంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత ఇద్దరు సూపర్‌స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. అమితాబ్‌తో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. మన నేచురల్ స్టార్ నాని కూడా ఈ సినిమాలో నటించాల్సి ఉంది. ఫాఫా క్యారెక్టర్ లేదా రానా రోల్‌లో ఏదో ఒకటి నటించాల్సిందిగా మేకర్స్ ఆఫర్ ఇచ్చారు. కానీ నాని రెండింటిని రిజెక్ట్ చేశారు.
రజనీ, అమితాబ్ వంటి దిగ్గజాలతో నటించాలన్నది ఏ నటుడికైనా లైఫ్ టైం కల. కానీ నాని మాత్రం ఆ ఛాన్స్ దక్కినా నో చెప్పేశారు. పాన్ ఇండియా మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా నాని ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయ్యేవాడే .. కానీ ఎన్నో లెక్కలు వేసుకుని నేచురల్ స్టార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. గతంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా విషయంలోనూ నాని ఇలాంటి లెక్కలే వేశాడు. ఇందులో నాగచైతన్య పోషించిన బాల రోల్ కోసం తొలుత నానీనే సంప్రదించారు. కానీ ఆయన తిరస్కరించారు.

ఇదిలాఉండగా.. ఈ సినిమాలో రజనీ వైఫ్‌గా నటించిన మంజు వారియర్ రోల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మనసిలాయో పాటకు ఆమె వేసిన స్టెప్స్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 46 ఏళ్ల వయసులోనూ ఎంతో అందంగా కనిపించడంతో పాటు డ్యాన్స్‌లో గ్రేస్ చూసి శెభాష్ అంటున్నారు. జైలర్‌లో నువ్ కావాలయ్యా అనే పాట తమన్నాకు ఎంతటి పేరు తీసుకొచ్చిందో మంజు వారియర్‌కు మనసిలాయో సాంగ్ అలాంటి క్రేజ్ తీసుకొచ్చింది.
నిజానికి మంజు వారియర్ కంటే ముందు లేడీ సూపర్‌స్టార్ నయనతారను సంప్రదించారట. అయితే ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడం పైగా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ తమన్నాను కలిశారట. ఇక్కడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో మేకర్స్ మంజు వారియర్‌ను సంప్రదించగా.. ఆమె మరో మాట లేకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా కోలీవుడ్ టాక్. కట్ చేస్తే లేటు వయసులో ఆ పాట మంజు కెరీర్‌కు పెద్ద బూస్టప్‌లా పనిచేసింది.


Click it and Unblock the Notifications











