Janhvi Kapoor అదిరేటి డ్రెస్సులో జాన్వీ కపూర్.. దేవర హీరోయిన్ ధరించిన మినీ డ్రెస్ ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ మళ్లీ తన బాయ్ ఫ్రెండ్ పేరుతో ఉన్న నెక్లెస్ తో దర్శన మిచ్చి హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఆమె వేసుకున్న కొత్త డ్రెస్ ధర ఎంత అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. మరి జాన్వి ధరించిన ఆ డ్రెస్ ధరపై మనం కూడా ఓ లుక్కేద్దాం పదండి.

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ గానే హింట్స్ ఇస్తూ వస్తోంది. తరచుగా తన బాయ్ ఫ్రెండ్ పేరు ఉన్న చైన్ మెడలో ధరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. డైరెక్ట్ గా తన లవర్ గురించి చెప్పట్లేదు కానీ సోషల్ మీడియాలో పోస్టులు, స్టిల్స్ ద్వారా తన ప్రియుడు శిఖర్ పహారియ గురించి చిన్న చిన్నగా హింట్ ఇస్తూ వస్తోంది.

Janhvi Kapoor dress price

జాన్వి శిఖర్ పహారియాతో డేటింగ్ చేస్తోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె షికు అని రాసి ఉన్న చైన్ ధరించి ఈవెంట్స్ కనిపిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది.

కాగా శిఖర్ పహరియ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. షికు, జాన్వి ఇద్దరూ ఎక్కువగా కలిసి తిరుగుతూ కనిపిస్తూ ఉంటారు. ఇటీవల జాన్వి శిఖర్ తో కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించడం వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చర్చకు దారి తీసింది.

ఇక కాఫీ విత్ కరణ్ అనే షోలో జాన్వి కపూర్ శిఖర్ గురించి బయట పెట్టేసింది. షికు ఎప్పుడూ తన స్పీడ్ డయల్ లిస్ట్ లో ఉంటాడని చెప్పింది జాన్వి. తన తండ్రి, చెల్లితో పాటు అత్యవసరంగా కాల్స్ చేయాల్సిన వాళ్ల లిస్టులో షికు పేరు ఉండడం కూడా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనే వార్తలకు ఆజ్యం పోసింది.

Janhvi Kapoor dress Worth

ఇదిలా ఉండగా, గత నెలలో ముంబైలో అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ మూవీ ప్రత్యేక ప్రదర్శనలో జాహ్నవి కపూర్ ఇదే నెక్లెస్ ను ధరించి కనిపించింది. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి జాన్వి అందమైన బ్లాక్ అండ్ వైట్ చెక్స్ ఉన్న మినీ డ్రెస్ ధరించి కనిపించింది. దాని పైకి సింపుల్ గా షికు అని రాసి ఉన్న నెక్లెస్మ్ స్టడ్ ఇయర్ రింగ్స్ ను ధరించి హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టి ఆమె చైన్, డ్రస్ పైనే ఉంది. ఇక ఈవెంట్ లో జాన్వి ధరించిన డ్రెస్ ఖరీదు అక్షరాల 1.7 లక్షలు అని సమాచారం. ఆమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ను ముద్దుగా షికు అని పిలుచుకుంటుంది.

కాగా ప్రస్తుతం జాన్వి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈపాన్ ఇండియా మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలో కూడా జాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అయితే దక్షిణాదిలో హిట్లు కొట్టి ఈ భామ సక్సెస్ అవుతుందా? అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X