Tripti Dimri: స్పిరిట్ ఆఫర్‌తో ఖరీదైన కారు కొన్న త్రిప్తి డిమ్రీ.. యానిమల్ బ్యూటీ కారు ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రీ అంటే యానిమల్ మూవీకి ముందు ఎవరో తెలియదు. కానీ సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాలో అందాల ఆరబోతతో ఓవరనైట్‌లోనే స్టార్ హీరోయిన్ అవ్వడమే కాకుండా యువతకు కలల రాణిగా మారిపోయింది. ఆ సినిమా తర్వాత వెంట వెంటనే ఆఫర్లు తన్నకొంటూ, వెతుక్కొంటూ వస్తున్నాయి. యానమిల్ సినిమా త్రిప్తి కెరీర్ గ్రాఫ్‌ను మాత్రమే మార్చకుండా ఆమె లైఫ్ స్టయిల్‌ను కూడా మార్చేసింది. ఆమె ఇటీవల కొన్న కారు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. త్రిప్తి డిమ్రీ కొన్న కారు విలువ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

త్రిప్తి డిమ్రీ కెరీర్ విషయానికి వస్తే.. మామ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత లైలా మజ్ను సినిమా ఆమెకు గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత బుల్ బుల్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత కాలాతో కూడా ఆకట్టుకొన్నది. అయితే యానిమల్ చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో గుర్తింపును ఇవ్వడమే కాకుండా బలంగా పాగా వేసేందుకు తోడ్పాటును అందించింది.

f Tripti Dimri s latest Porsche 911 Carrera

యానిమల్ తర్వాత త్రిప్తి డ్రిమి కెరీర్, లైఫ్ స్టయిల్ మారిపోయింది. ఆ మూవీ తర్వాత గ్లామర్ క్వీన్‌గా మారిపోయిన ఆమె బ్యాడ్ న్యూజ్‌తో చెలరేగిపోయింది. ఈ సినిమాలో మరింత హాట్ హాట్‌గా నటించింది. అలాగే వికీ విద్య కా వో వాలా వీడియోలో గ్లామర్, కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలో నటన పరంగా మెప్పించింది. దాంతో భారీ రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లగా మారిపోయింది.

అయితే యానిమల్ సినిమా అనంతరం బిజీ హీరోయిన్‌గా మారిపోయిన త్రిప్తి రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. దాంతో కారు, బంగళాలు ఆమె ఆస్తుల చిట్టాలో చేరింది. ఇటీవల ఆమె పోర్చే 911 కార్రేరా అనే కారును కొనుగోలు చేసింది. బ్లూ రంగు కారులో ఆమె దిగి వస్తుండగా బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు ఆ కారును, అందులోని వయ్యారి భామను క్లిక్ మనిపించారు. ఈ వీడియోను ఇన్స్‌టాంట్ బాలీవుడ్ అనే సోషల్ మీడియా అకౌంట్ షేర్ చేసింది.

f Tripti Dimri s latest Porsche 911 Carrera

త్రిప్తి డిమ్రీ కొనుగోలు చేసిన పోర్సే కారులో మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. రియర్ వ్యూ కెమెరాతోపాటు 360 డిగ్రీలు కవర్ చేసే కెమెరా, 10.9 ఇంచెస్ టచ్ స్క్రీన్, 13 స్పీకర్ బర్మెస్టర్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ కారును గంటకు 293 కిలోమీటర్ల వేగంతో నడిపించవచ్చు. ఇంజిన్ సామర్థ్యం 2981 సీసీ - 3996 సీసీ కెపాసిటీ ఉంది అని కార్ దేఖో వెబ్ సైట్ వెల్లడించింది. ఇక ఈ కారు ఖరీదు 2.11 కోట్ల నుంచి మొదలై టాప్ మోడల్ 4.26 కోట్ల వరకు ఉంటుంది అని పేర్కొన్నది.

త్రిప్తి డిమ్రీ నటించిన రాబోయే సినిమాల విషయానికి వస్తే.. భూల్ భులయ్యా 3 చిత్రంలో ఆమె అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం దడక్ 2 చిత్రంలోను, అలాగే అర్జున్ ఉత్తారా అనే సినిమాలో నటిస్తున్నది. తాజాగా సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్‌గా భారీ ఆఫర్ దక్కించుకొన్నది. ఈ సినిమాతో ఆమె కెరీర్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది అని ఆశిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X