Sai Pallavi: లేడీ పవర్ స్టార్ రేంజ్ వేరే లెవల్.. అమరన్ సినిమా కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
Sai Pallavi: మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఇండస్ట్రీలో అంతటి గౌరవాన్ని దక్కించుకున్న హీరోయిన్ ఎవరంటే.. వెంటనే వచ్చే సమాధానం సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకుల మదిలో ఆ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకుంది ఈ అమ్మడు. సాయి పల్లవి నటించిన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు కూడా కొల్లగొట్టకున్న.. తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అయితే.. సౌత్ ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా అమరన్. ఈ మూవీలో నటించడం కోసం హీరోయిన్ సాయి పల్లవి ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?
న్యాచులర్ బ్యూటీ సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో తన అద్భుత నటనతో మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి 'కాళి' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ హిట్ తో
మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ అయింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ఈ నేచురల్ బ్యూటీ.

ఇక ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా సాయి పల్లవి నటించి.. తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టిసిందే. తన కెరీర్ లో వరుస హిట్ అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది.
ప్రస్తుతం సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాకు అటు తమిళం, ఇటు తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుందట.

ఈ మూవీ ప్రమోషన్లలో సాయి పల్లవితోపాటు తన మూవీ టీమ్ తో బిజీగా ఉంది. ఈ రియల్ లైఫ్ మూవీలో మేజర్ ముకుంద్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించింది. ఈ మూవీతో మరోసారి ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి సిద్ధమైంది సాయి పల్లవి. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అమరన్ మూవీలో నటించడానికి సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీంతో మూవీ మేకర్స్ కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. రెండేళ్ల కిందట సాయి పల్లవి ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీని అవమానించేలా మాట్లాడిందంటూ ఓ పాత వీడియోను వైరల్ చేస్తూ బాయ్‌కాట్ సాయి పల్లవి అంటూ పిలుపు ఇవ్వడం గమనార్హం. ఈ ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











