ఐటెం సాంగ్‌కు 5 కోట్లా? ఈ 5 గురు భామలే కాదు.. వారి రెమ్యునరేషన్ యమ హాట్ గురూ!

మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి కమర్షియల్ సినిమాల్లో పక్కగా ఓ ఐటెం సాంగ్స్ ఉండాల్సిందే. అదే లెటేస్ట్ ట్రెండ్. అయితే.. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అనగానే జయమాలిని, జ్యోతి లక్ష్మి, సిల్క్ స్మిత వంటి కొంతమంది నటీమణులు గుర్తొచ్చేవారు. వారు మాత్రమే ఐటెం సాంగ్స్ చేసేవారు. కానీ ప్రస్తుతం సినిమా ట్రెండ్ మారిపోయింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న భామలు కూడా ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తమ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. దీంతో మూవీ మేకర్స్ కూడా అసలు తగ్గేదేలే అన్నట్టుగా.. స్టార్ హీరోయిన్స్ కే కోట్ల రెమ్యునిరేషన్ ఇచ్చి మరి కేక పుట్టించే సెప్పులేపున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా ఇలా ఒకే టిక్కెట్ పై రెండు షోలుచూడవచ్చు అన్నట్లు సినిమా హాల్స్ కు క్యూ కడుతున్నారు. ఇంతకీ టాప్ హీరోయిన్స్ ఒక్కొ ఐటెం సాంగ్ కి ఎంత రెమ్యూరేషన్ తీసుకుంటున్నారో ఓ లుక్ వేయండి.

How Much Samantha Ruth Prabhu Katrina Kaif Sunny Leone Malaika Arora Nore Fatehi demands remuneration for Special

సమంత రుత్ ప్రభు:

అటు టాలీవుడ్.. ఇటు బాలీవుడ్ లో దుమ్ము దూలుపుతున్న టాప్ హీరోయిన్. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ .. పుష్ప ది రైజ్‌లో 'ఊ అంటావా మావ..' అనే సాంగ్ లో అల్లు అర్జున్ తో రెచ్చిపోయిన సమంత ఏకంగా రూ. 5 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నట్టు సమాచారం. కానీ, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే రెమ్యూరేషన్ తీసుకుందంట.

How Much Samantha Ruth Prabhu Katrina Kaif Sunny Leone Malaika Arora Nore Fatehi demands remuneration for Special

ఊర్వశి రౌతేలా:

ఈ మధ్య కాలంలో ఎక్కువ ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తున్న హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా. టాలీవుడ్ ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి సినిమాల్లో ఊర్వశి రౌతేలా సెప్పులకు మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ అదుర్స్. ఊర మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఐటెం బ్యూటీ ఒక్కో ఐటెం సాంగ్ కు 2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

How Much Samantha Ruth Prabhu Katrina Kaif Sunny Leone Malaika Arora Nore Fatehi demands remuneration for Special

సన్నీ లియోన్:

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ గురించి యూత్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె అందానికి, అదిరిపోయే మాస్ స్టెప్పులు తోడైతే థియేటర్ దద్దరిల్లాల్సిందే. ఈ బోల్డ్ బ్యూటీ .. రాజశేఖర్ గరుడవేగా సినిమాలో హాట్ స్టెప్పులు చేయడానికి ఏకంగా 2 కోట్ల వరకు వసూలు చేసిందట.

How Much Samantha Ruth Prabhu Katrina Kaif Sunny Leone Malaika Arora Nore Fatehi demands remuneration for Special

జాక్వెలిన్ ఫెర్నాండేజ్:

ఇటీవల ఐటమ్ సాంగ్స్ లో కనిపిస్తున్న మరో హాట్ బ్యూటీ, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. సాహో'సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో బ్యాడ్ బాయ్ అనే ఐటెం సాంగ్ లో రోమాన్స్ పీక్స్. 'సాహో' ప్రీ రిలీజ్ సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ అప్పట్లో యూట్యూబ్‌ని షేక్ చేసింది. కాగా ఈ సాంగ్ కోసం ఈ శ్రీలంక బ్యూటీ ఏకంగా రూ. 2 కోట్ల పారితోషికంగా తీసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

How Much Samantha Ruth Prabhu Katrina Kaif Sunny Leone Malaika Arora Nore Fatehi demands remuneration for Special

మలైకా అరోరా:

బాలీవుడ్ ఐటమ్ లేడీ మలైకా అరోరా ఒకరు. తన అంద, చందాలతో ప్రేక్షకులను పుల్ మిల్స్ అందిస్తుంది. బాలీవుడ్ లో మున్నీ బద్నామ్ హూయీ సాంగ్‌తో ఆమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇటు టాలీవుడ్ లో మహేష్ బాబు అతిథి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ.. పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌' సినిమాలో కెవ్వుకేక అంటూ.. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించుకుంది. ఇలా ఇటు టాలీవుడ్ , అటు బాలీవుడ్‌లో నెంబర్ వన్ ఐటమ్ గర్ల్‌గా సత్తా చాటుతోంది. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ కోసం 50 లక్షలు నుంచి కోటీ రూపాయాల వరకు డిమాండ్ చేస్తుందట.

సినీ వర్గాల అభిప్రాయం ప్రకారం .. కేవలం 4 లేదా 5 నిమిషాల ఐటెం సాంగ్ కోసం ఒక్కో టాప్ హీరోయిన్స్ రూ.5 కోట్ల వరకూ పైగా వసూళ్లు చేస్తున్నారంట. అలాగే.. జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తమన్నా భాటియా, తాప్సీ వంటి హాట్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు తీసుకునే పారిదోషం కంటే ఐటెం సాంగ్ కే ఎక్కువ వసూలు చేస్తురంట. వాస్తవానికి సినిమాల కోసం చాలా రోజులు కేటాయించవలసి ఉంటుంది, అదే ఐటమ్ సాంగ్ అయితే.. చాలా తక్కువ రోజుల్లో పూర్తి చేసుకోవచ్చు. ఈ సాంగ్స్ చేయడం వల్ల డబ్బుకు డబ్బు.. ఫుల్ గా క్రేజ్ ను సంపాదించుకోవచ్చు. ఇలా దీపం ఉండగానే ఇళ్లు సక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని హీరోయిన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X