ప్రియాంక చోప్రా సంపాదన ఎంతో తెలుసా? స్టార్ హీరోలను తలదన్నేలా పారితోషికం ఎంతంటే?

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జూలై 18న 42వ ఏట అడుగుపెట్టింది. బాలీవుడ్ లఓ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ సడన్ గా హిందీ చిత్రసీమకు గుడ్ బై చెప్పి హాలీవుడ్‌లో స్థిరపడింది. అంతేకాదు స్టార్ హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం వసూలు చేస్తుందో ఓ లుక్కేద్దాం పదండి.

బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించింది. అయితే చిన్నతనంలోనే వర్ణవివక్షను ఎదుర్కొన్న ఈ అమ్మడు 18 ఏళ్ల వయసులోనే 90 దేశాలకు చెందిన అందమైన పోటీదారులను ఓడించి 2000లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. ప్రపంచ సుందరి విజేతగా నిలిచిన ప్రియాంక మొదట తమిళ చిత్రసీమలోకి ప్రవేశించి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

How munch Priyanka chopra net assets and remuneration vehicles details

ఐత్రాజ్, క్రిష్, ఫ్యాషన్, డాన్ 2, అగ్నిపత్ వంటి ఎన్నో సినిమాలలో నటించి, మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక బాలీవుడ్ అగ్ర నటీమణులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాపించుకుంది. అయితే 2015 తర్వాత ఆమె అకస్మాత్తుగా హిందీ సినీ పరిశ్రమను విడిచి పెట్టింది. దానికి కారణం ఇండస్ట్రీలఓ జరిగే రాజకీయలేనంటూ ఆ తరువాత క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ప్రియాంక హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడాక, కూతురు మాల్టీతో కలిసి పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది.

ప్రస్తుతం ఒక్కో సినిమాకు స్టార్ హీరోలు కూడా దిగదుడుపే అన్పించేలా పారితోషికం అందుకుంటున్న ప్రియాంకకు అమెరికాలో రూ.238 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఆ ఇంట్లో విలాసవంతమైన గార్డెన్ ఏరియా, ఓపెన్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అంతేకాకుండా, అందమైన ఇంటీరియర్ తో ఆ ఇల్లు ఒక అద్భుతమైన ప్యాలెస్ లా ఉంటుంది. అలాగే ముంబైలో కూడా ఆమెకు రెండు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి, వాటి విలువ ఒక్కోటి రూ. 8 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

How munch Priyanka chopra net assets and remuneration vehicles details

గోవాలోని బాగా బీచ్ సమీపంలో ప్రియాంకకు దాదాపు రూ.20 కోట్ల విలువైన ప్రాపర్టీ ఉంది. అంతేకాదు ఈ బ్యూటీకి ఒక ప్రైవేట్ జెట్, రూ. 1.1 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, పోర్షే, ఆడి క్యూ7, బిఎమ్‌డబ్ల్యూ 5, రూ. 2.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటితో పాటు ప్రియాంక బిజినెస్ కూడా చేస్తోంది. అనోమలీ అనే హెయిర్ కేర్ బ్రాండ్ ప్రియాంకకు సంబంధించిందే. న్యూయార్క్‌లో ఆమెకు సోనా అనే రెస్టారెంట్ కూడా ఉంది. అంతేకాదు ప్రియాంకకు పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది.

ఇలా ఇన్ని కోట్ల ఆస్తులతో రాణిలా బ్రతుకుతున్న ప్రియాంక ఒక్కో సినిమాకు ఇప్పుడు 40 కోట్లు పారితోషికంగా తీసుకుంటోంది. హాలీవుడ్ వెబ్ సిరీస్‌ సిటాడెల్ లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అందులో హాలీవుడ్ స్టార్ రిచర్డ్ మాడెన్‌తో సమానంగా 250 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంది. ఒక హాలీవుడ్ నటుడితో సమానంగా రెమ్యునరెహన్ అందుకున్న తొలి భారతీయ నటిగా ప్రియాంక చరిత్రను సృష్టించింది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ దేశి గర్ల్ ఒక్క ఇన్‌స్టా పోస్ట్ కోసం రూ. 3 కోట్లు, ఒక్క యాడ్ కోసం రూ.5 కోట్లు వసూలు చేస్తుంది. మొత్తంగా ప్రియాంక చోప్రా ఆస్తులు దాదాపు రూ.620 కోట్లు. ప్రియాంక ప్రతి నెలా రూ.1.5 కోట్లు సంపాదిస్తోంది.

More from Filmibeat

Read more about: priyanka chopra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X