Rakul - Modi: మోదీజీకి రకుల్ ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? వెనక జరిగిన అసలు డ్రామా ఇది!

రకుల్.. రకుల్.. రకుల్.. ​ ఇప్పుడంతా ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకుల్లో ఈ పేరే వినిపిస్తుంది. అందుకు కారణం ఆమె పెళ్లి ఒకటైతే. మరో కారణం దేశ ప్రధాన మంత్రి మోదీ ఆమెకు స్పెషల్​గా విష్ చేయడం. దీంతో అందరూ కాస్త షాక్ అండ్ సర్​ప్రైజ్ కూడా అయ్యారు. అదేంటి రకుల్​కు​ బాలీవుడ్​లో అంత క్రేజ్ ఉందా? ఏకంగా మోదీనే విష్ చేశారు.

అయినా ఆయన ఎక్కువగా ఎవరైనా ఏదైనా సాధిస్తే ప్రశంసలు చెబుతారు. లేదంటే ఏదైన ప్రమాదం జరిగితే ప్రగాఢ సానుభూతి తెలుపుతారు? లేదంటే మరీ పెద్ద సెలబ్రిటీలకు ఇలాంటి విషెస్ తెలుపుతారు. కానీ రకుల్​కు పెళ్లి విషెస్​ చేశారు అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు. అసలు మోదీజీ ఆమెను విష్​ చేయడానికి కారణం ఏమిటి? అంత లింక్ ఏముందో ఇప్పుడు స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

How special is Heroine Rakul Preet Singh to PM Narendra Modi See Details Here?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాజూకు భామగా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. మొదట చిన్న హీరోయిన్​గా కెరీర్​ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే రేంజ్​కు ఎదిగింది. ఈ క్రమంలోనే బాలీవుడ్​లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఇక అక్కడే పాగా వేసి ఛాన్స్​లు అందుకుంది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

అయితే తిరిగి వెనక్కి టాలీవుడ్ రావాలన్న ఇక్కడ ఇతర యంగ్ బ్యూటీల హవా ఎక్కువైంది. రకుల్​ ఓల్డ్​ గ్లామర్ అయిపోయింది. దీంతో ఆమెకు తెలుగులోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక అడపా దడపా ఛాన్స్​లు రావడం మొదలయ్యాయి. ఈ జర్నీలోనే ఆమె బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడి రిలేషన్​షిప్ మెయిన్​టెయిన్ చేసింది. అలా ఓ వైపు ప్రేమాయణం నడిపిస్తూనే మరోవైపు తనకొచ్చిన అవకాశాల్లో నటిస్తూ ముందుకెళ్లింది.

ఇక సరైన సమయం చూసుని గోవాలో గ్రాండ్​గా తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు కూడా విచ్చేసి సందడి చేశారు. అయితే వాస్తవానికి ఈమె పెళ్లి విదేశాల్లో చేసుకోవాలని అనుకుందట. కానీ నరేంద్ర మోదీ సలహా మేరకే, ఆయన సూచనలు పాటిస్తూ రకుల్​ గోవాలో పెళ్లి చేసుకునిందట. దీంతో నరేంద్ర మోదీ ఇంప్రెస్ అయి రకుల్ జాకీలకు స్పెషల్ వెడ్డింగ్ విషెస్ చెప్పారని బయట కథనాలు వస్తున్నాయి. లేదంటే మోదీ ఏ సెలబ్రిటీ జంటకు పెళ్లి జరిగిన విషెస్ చెప్పడం చాలా రేర్ అంట.

సరే ఏదేమైనప్పటికీ రకుల్ - జాకీకి మోదీ వెడ్డింగ్ విషెస్ చెప్పడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో ఈ విషయం వైరల్​గా మారింది .ఇకపోతే రకుల్ తాజాగా తన వెడ్డింగ్ ఫొటోస్, వీడియోస్​ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రీసెంట్​గా అయలాన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రకుల్ త్వరలోనే భారతీయుడు 2 చిత్రంతో ఆడియెన్స్​ను అలరించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X