సమంతతో విడాకులు.. నాగచైతన్య ఎన్ని వందల కోట్లు ఇచ్చాడో తెలుసా? కానీ

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషకాలు అందుకునే హీరోయిన్లలో ఒకరిగా చేరిపోయారు. తమిళనాడుకు చెందిన సమంత రూత్ ప్రభు తెలుగు చిత్రాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. దక్షిణాదిలోని స్టార్ హీరోలకు జోడిగా నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది సమంత. 15 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఏ మాయ చేసావే సినిమాతో సమంత రూత్ ప్రభు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం 2010లో విడుదలైంది. అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా నటించారు. నాగచైతన్య సమంత రూత్ ప్రభు జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలోని వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్నాళ్లకు దాన్నే నిజం చేశారు కూడానూ. 2017లో అక్కినేని నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు స్టార్ కపుల్ గా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు.

Huge Alimony Offered to Samantha Ruth Prabhu from her Ex Husband Naga Chaitanya

కానీ వీరి పచ్చటి కాపురం పై ఏ కన్ను పడిందో కానీ పలు కారణాలతో విడిపోవాల్సి వచ్చింది. 2021 అక్టోబర్ లో ఊహించని విధంగా డివోర్స్ ప్రకటించారు. వీరి విడాకుల వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. వీరి విడిపోయి దాదాపు నాలుగేళ్లు పూర్తి కావస్తున్న ఇప్పటివరకు అసలు కారణం ఏంటనేది బయటకు రాలేదు. అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారని టాక్ మాత్రం వినిపించింది. వీరిద్దరూ డివోర్స్ తీసుకోవడంతో అభిమానులు ఎంతో అప్సెట్ అయ్యారు. డ్రీమ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు డివోర్స్ తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తుంది.

అయితే సినిమా పరిశ్రమలో పెళ్లిళ్లు, విడాకులు ప్రస్తుతం సాధారణంగా మారిపోయాయి. కొన్నాళ్ల నుంచే ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది. అయితే డివోర్స్ తీసుకున్న సందర్భంలో హీరోయిన్లు తమ భర్తల నుంచి విడిపోతూ భారీ భరణాన్ని డిమాండ్ చేస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటివరకు తమ భర్తల నుంచి విడిపోయిన బ్యూటీలు ఓ రేంజ్ లోనే భరణం అందుకున్నారు. అయితే సమంత రూత్ ప్రభు మాత్రం ఒక్క రూపాయి కూడా భరణం ఆశించలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే భరణం ఆశించని నటిగా సమంత నిలిచింది.

మరోవైపు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకునే సందర్భంలో ఏకంగా 200 కోట్ల భరణాన్ని ఆఫర్ చేశారంట. ఇక నాగచైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత రూత్ ప్రభు ఆ భరణాన్ని తిరస్కరించిందట. అలా చేసి తమ ప్రేమకు విలువనిచ్చిందని అంటున్నారు. ఆర్థిక సంబంధాలే ఉన్న ఈ రోజుల్లో కూడా సమంతా రూత్ ప్రభు భరణం తీసుకోకుండా డివోర్స్ కు అంగీకరించడం హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత ఇప్పటికీ సింగల్ గానే జీవితాన్ని కొనసాగిస్తుంది. మరోవైపు నాగచైతన్య నటి శోభిత ధూళిపాలను రెండవ వివాహం చేసుకొని సెకండ్ లైఫ్ ను ప్రారంభించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X