RRR:అలియా భట్ కోసం మరోసారి భారీగా ఖర్చు చేస్తున్న రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా బడ్జెట్ విషయంలో కంట్రోల్ లో ఉండాలని చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. పెద్ద సినిమా అయితే ముందుగా బడ్జెట్ లెక్కలపై క్లారిటీ వస్తే గాని సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళరు. ఇక RRR కోసం కూడా అదే తరహాలో ముందుకు వెళ్లారు. బాహుబలి అనుభవం ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యింది.
అప్పుడు చేసిన పొరపాట్ల వలన సినిమా షూటింగ్ ను కాస్త ఆలస్యంగా పూర్తి చేయాల్సి వచ్చింది. ఇక RRRను అలా కాకుండా ఒక ఏడాదిలోనే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ కరోనా రావడం వలన ప్లాన్ మొత్తం మారిపోయింది. ఇక RRR రెమ్యునరేషన్స్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అలియా భట్ కు కూడా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా ఇస్తున్నారు. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది.

ఇటీవల రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా అలియా భట్ పాత్రపై హై లెవెల్లో కామెంట్ చేసి ఆమె రేంజ్ పెంచారు. అయితే ఆమె కోసం ఒక పెద్ద సెట్స్ లో సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దాదాపు దానికోసమే 3కోట్లు ఖర్చు చేస్తున్నారట. సినిమాలో ఆ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని సమాచారం. ఇక సినిమా షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. బుధవారం విడుదల చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు డోస్ ను మరింత పెంచేసింది. ప్రస్తుతం ఆ వీడియో టాప్ ట్రేండింగ్ లిస్టులో కొనసాగుతోంది. ఇక సినిమాను అనుకున్న తేదీ ఆక్టోబ 13న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి జక్కన్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











