నెక్ బికినీలో రెచ్చిపోయిన హ్యూమా ఖురేషీ.. అలా జారవిడుస్తూ అభిమానులకు అందాల విందు!
రజినీకాంత్- పా రంజిత్ కాంబినేషన్ లో వచ్చిన కాలా సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమైంది హ్యూమా ఖురేషీ. కాలా సినిమాలో రజినీకాంత్ లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించిన ఈ భామ హిందీలో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో కనిపించింది. అయితే ఈ భామ తాజాగా బికినీలో కనిపించి షాకిచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

చదువుకునే రోజుల్లోనే
ఢిల్లీలో సంప్రదాయ ముస్లిం కుటుంబంలో పుట్టిన హ్యూమా ఖురేషీ, చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆశక్తితో నాటకాలు వేయడం ప్రారంభించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అనేక ఎన్జీవోలకు డాక్యుమెంటరీలు చేసే ఒక ఫిల్మ్ మేకర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసి ఫిలిం మేకింగ్ మీద కూడా ఆమె శ్రద్ధ పెట్టింది. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరిన ఈ భామ అనేక టీవీ యాడ్స్ లో కూడా కనిపించింది.

వరుస సినిమా అవకాశాలు
గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ రెండు భాగాల్లో మోషినా అనే పాత్రలో నటించిన ఈ భామ నటన అందరికీ నచ్చడంతో ఈ భామకు వరుస అవకాశాలు దక్కాయి. అలా బాలీవుడ్ లో డీడే, బద్లాపూర్, హైవే, x past is present, వైట్, కాలా, లీల, మహారాణి వంటి సినిమాలతో పాటు కొన్ని టీవీ సిరీస్ లలో కూడా నటించింది. నిజానికి అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా 2 సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ప్రాజెక్ట్ చాలా లేట్ అవుతూనే రావడంతో ఈ భామ ఆ ప్రాజెక్టు చేయలేనని బయటకు వచ్చేసింది.

ఏకంగా హాలీవుడ్
ఆ తర్వాత బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ కాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ భామ నటించిన ఆర్మీ ఆఫ్ ది డెడ్ సినిమా గత నెలలో రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఆమె నటన నచ్చడంతో ఆవిడకు హాలీవుడ్లో కూడా నటించే అవకాశం దక్కింది.. ఇక ప్రస్తుతం ఈ భామ అజిత్ హీరోగా వస్తున్న వాలిమై అనే సినిమాలోనే కాక అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న బెల్ బాటం సినిమాలో కూడా నటిస్తోంది.

ప్రధానిగా సోనూసూద్
ఆ మధ్య సోనూసూద్ ప్రధాని కావాలని కోరి ఆమె మళ్లీ వార్తల్లోకెక్కింది. సోనూసూద్ లాగే సేవ చేసే వ్యక్తిని తాను మరెక్కడా చూడలేదు అని పేర్కొంటూ ఆయనకు ప్రధాని అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని కామెంట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ విషయం మీద సోనూ స్పందిస్తూ తనకు రాజకీయాలు అంటే ఎలాంటి ఆసక్తి లేదని ఇలాగే సేవ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు.

ఓవర్ కోటు కిందకు జారుస్తూ
అయితే ఈ భామ తాజాగా నెక్ బికినీతో కనిపించి అందరికీ హాట్ ట్రీట్ ఇచ్చింది. సాధారణంగా హీరోయిన్స్ ఎక్కువ టూ పీస్ బికినీలో కనిపిస్తూ ఉంటారు. కానీ దానికి విరుద్ధంగా ఈ భామ బికినీతో కనిపించి ఓవర్ కోటు కిందకు జారుస్తూ ప్రేక్షకులకు హాట్ ఇచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











