హాబ్రిడ్ పిల్లలో మరో యాంగిల్... విలన్ గా సాయిపల్లవి!
రొటీన్ కు భిన్నమైన పాత్రల ఎక్కడ దొరికితే అక్కడ రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతుంది సాయి పల్లవి. సహజమైన నటనతో తాను ఎంచుకున్న పాత్రలకు పాణం పోస్తున్న సాయిపల్లవి ఇప్పుడు ఏకంగా అసాధారణంగా ప్రయోగానికి సిద్ధమైపోతోందట.
సాధారణంగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోయిన్లు ప్రయోగాల జోలికి పోయేందుకు సాహసించరు. కానీ, సాయి పల్లవి మాత్రం ఆ సాహసం చేసేందుకు సై అంటోంది. తన తదుపరి చిత్రంలో విలనీగా కనిపించేందుకు సిద్ధమైపోతోంది. నాచురల్ స్టార్ నానీ తదుపరి చిత్రంలోనే మన హైబ్రిడ్ పిల్ల నెగిటివ్ రోల్ లో కనిపించబోతోందట. మరి కొద్ది రోజుల్లో నానీ నటించిన "V" ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై విడుదలవ్వబోతోంది.

దీని తరువాత టక్ జగదీశ్, శ్యామ్ సింఘా రాయ్ అనే చిత్రాల్లో నటించనున్నాడు నానీ. టాక్సీవాలా ఫేం రాహుల్ సంక్రిత్యా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న శ్యామ్ సింఘా రాయ్ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతోందట. ఈ సినిమాలోనే సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. అంతేకాదు, ఇందులోనే అమ్మడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.
శ్యామ్ సింఘా రాయ్ కోసం ఇప్పటికే భారీ ఎత్తున ప్రత్యేకమైన సెట్స్ సిద్ధం చేస్తున్నారు. టక్ జగదీశ్ షూటింగ్ పూర్తవుతూనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఇప్పటికే విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయిపల్లవి, ఈ వైవిధ్యమైన నెగిటివ్ రోల్ తో ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











