హైదరాబాద్ పిల్ల అందాల ఊచకోత: అసలైనవే హైలైట్ అయ్యేలా ఘాటు ఫోజులు
అందం, అభినయంతో రాణించే అమ్మాయిలు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. కానీ, వీళ్లలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుండగా.. చాలా మంది కెరీర్‌లను సాఫీగా ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అలాంటి వారిలో హైదరాబాద్ పిల్ల అదితి రావు హైదరి ఒకరు. కావాల్సినన్ని టాలెంట్లు ఉన్నా ఈ అమ్మడు ఆశించిన రీతిలో ఆఫర్లను మాత్రం అందుకోవడం లేదు. అయినా అప్పుడప్పుడూ వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. ఇక, సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోన్న అదితి రావు హైదరి.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
అక్కడ ఎంట్రీ.. శృంగారంతో:హైదరాబాద్‌కు చెందిన అదితి రావు హైదరి.. మోడలింగ్ రంగంలో కొంత కాలం మెరిసింది. అలా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే 2006లో వచ్చిన 'ప్రజాపతి' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా 'శృంగారం', 'డిల్లీ 6' వంటి చిత్రాలతో తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లోకి సైతం అడుగు పెట్టి ఫేమస్ అయింది.

తెలుగులోకి.. ఆ సినిమాల్లోనే:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత వరుస పెట్టి హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే అదితి రావు హైదరి 'సమ్మోహనం' అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 'అంతరిక్షం 900KMPH', 'మహా సముద్రం' సినిమాలను చేసింది. ఇవి మాత్రమే చేసిన తర్వాత అదితి టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చేసింది.
సక్సెస్ లేకున్నా ఆఫర్లతోనే:తెలుగులో అదితి రావు హైదరి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా.. ఈమె చేసిన ఎన్నో సినిమాలు పరాజయం పాలయ్యాయి. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి. కానీ, హిందీలో సినిమాలు చేసింది. అయితే, అక్కడ కూడా ఆమెకు మంచి సక్సెస్ రాలేదు. అయినప్పటికీ ఆఫర్లు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇలా ఇప్పుడు 'గంధీ టాక్స్', Lioness మూవీలు చేస్తోంది.

సిద్దార్థ్‌తో లవ్.. జంటగా బిజీ:వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న అదితి రావు హైదరి కొంత కాలంగా హీరో సిద్దార్థ్‌తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇందులో భాగంగానే అతడితో కలిసి తరచూ ట్రిప్పులకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తోంది. కానీ, అతడితో ఉన్న బంధం గురించి ఓపెన్ మాత్రం అవడం లేదు. ఇక, వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అందులో ఎవరూ లేనంతగా:కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అదితి రావు హైదరి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయంలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా వాళ్లను ఖుషీగా ఉంచుతోంది.

అందాలను దాచుకోకుండా:అదితి రావు హైదరి సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇలా తన గ్లామర్‌తో అదితి రావు హైదరి ఇంటర్నెట్‌ను షేక్ చేయడంతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అదిరే ఫోజులతో అరాచకం:బోల్డు హీరోయిన్ అదితి రావు హైదరి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ ట్రెడీషనల్ డ్రెస్‌లో ఫొటోలను దిగింది. వీటిలో టాప్ డీప్ నెక్ టైప్ ఉండడంతో అదితి రావు క్లీవేజ్ హైలైట్ అవుతోంది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఆమె షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.


Click it and Unblock the Notifications











