అందాలను గాలికి వదిలేసిన హైదరాబాద్ భామ.. బికినీలో కంటే హాట్ గా ఎద, నాభి సొగసు
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఉపయోగం స్టార్ సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీయువకులకు అనువుగా మారింది. వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ముద్దుగుమ్మలు సైతం ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హాట్ షో చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ బ్యూటి శ్రేయ ధన్వంతరి ఒకరు. ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 వెబ్ సిరీస్ ల ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ తాజాగా హాట్ షోలో హద్దు దాటేసింది.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్..
హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది. ఇలా మోడలింగ్ రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేసింది ఈ బ్యూటి.

మోడలింగ్ రంగంలో..
మోడలింగ్ రంగంలో తనదైన అందంతో రాణిస్తున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి. ఇలా అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈ భామ.

కాలేజీ ఫ్రెండ్ గా..
శ్రేయ ధన్వంతరి ముందుగా అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా పరిచయం అయిన జోష్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోనప్పటికీ కథ పరంగా పర్వాలేదనిపించుకుంది. ఇందులో నాగ చైతన్యకు కాలేజీ ఫ్రెండ్ గా కనిపించింది. ఒంటరిగా ఏ గ్యాంగ్‌లో చేరని నాగ చైతన్యతో ఆ కాలేజ్‌లో తమదే మంచి గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకునే ఒక్క సీన్ లో మాత్రమే మెరిసింది ఈ చిన్నది.

రాని గుర్తింపు..
జోష్ సినిమాతోపాటు సందీప్ కిషన్ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో ఆకట్టున్నప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ స్టన్నింగ్ బ్యూటి. అక్కడ షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంచి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టింది.
నిజాయితీ గల..
హిందీలో ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది అచ్చమైన తెలుగు అందం శ్రేయా ధన్వంతరి. అయితే వీటిలో ముందుగా వై చీట్ ఇండియా, ది ఫ్యామిలీ మ్యానే సిరీస్ లతో సూపర్ పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటి. ఇందులో నిజాయితీ గల పోలీస్ అధికారిణిగా తన నటనతో ఆకట్టుకుంది శ్రేయా ధన్వంతరి.
తమిళ చిత్రాల్లో కూడా..
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో వచ్చిన ఫేమ్ తో ఈ హైదరాబాదీ బ్యూటీ శ్రేయా ధన్వంతరికి స్కామ్ 1992 సిరీస్ లో అవకాశం లభించింది. హర్షత్ మెహతా లైఫ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాపులర్ ఇండియన్ జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో అదరగొట్టింది ఈ హాట్ బ్యూటి. ఇలా హిందీలోనే కాకుండా తమిళం చిత్రాల్లో కూడా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. ఇక గతేడాది సీతా రామం హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన చుప్ చిత్రంతో అలరించింది.
గాలికి వదిలేసి.. బికినీ కంటే..
ఇదిలా ఉంటే సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి. ప్రతి ఫొటో హాట్ షో కోసమే అన్నట్లుగా ఉంటుంది. తాజాగా వైట్ షర్ట్ వేసుకున్న ఈ భామ బటన్స్ పెట్టుకోకుండా గాలికి వదిలేసింది. దీంతో ఆమె ఎద అందాలు ఎన్నడు లేని విధంగా సూపర్ హాట్ గా కనువిందు చేస్తున్నాయి. మరొక పిక్ లో ఎదతోపాటు నాభి సొగసు కూడా మైమరిపించేలా ఉంది. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోల్లో అచ్చమైన తెలుగు అందం బికినీ షో కంటే హాట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











