వాటర్‌లో వైట్ శారీలో తెలుగు పిల్ల షో.. చలిలో వేడి పుట్టించడం అంటే ఇదేగా!

తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది హీరోయిన్లు ఆశించిన రీతిలో కెరీర్‌లను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. అన్నీ ఉన్నా అవకాశాలను మాత్రం అందుకోవడంలో విఫలం అవుతోంది.

అందుకే అడపాదడపానే సినిమాలు చేస్తోంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా నందినీ రాయ్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూసేయండి!

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

ఆంధ్రాకే అందగత్తెగా: హైదరాబాద్‌కు చెందిన నందినీ రాయ్ సినిమాల కంటే ముందు మోడలింగ్ రంగంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైంది. దీంతో ఈ బ్యూటీ ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. ఆ తర్వాత నందినీ నేషనల్ రేంజ్‌లో సైతం మోడల్‌గా సందడి చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

హిందీ నుంచి ఇక్కడ: మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో నందినీ రాయ్‌కు అవకాశాలు భారీగా వచ్చాయి. దీంతో ఈ అమ్మడు 'ఫ్యామిలీ ప్యాక్' అనే బాలీవుడ్ మూవీతో ఆమె హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'మాయ' అనే సినిమాతో తెలుగులోకి కూడా వచ్చింది. అనంతరం 'మోసగాళ్లకు మోసగాడు', 'సిల్లీ ఫెలోస్' వంటి సినిమాల్లో నటించింది కానీ గుర్తింపును తెచ్చుకోలేదు.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

బిగ్ బాస్‌కు వెళ్లింది: అప్పుడప్పుడే తెలుగులో సినిమా నటిగా ఎదుగుతోన్న సమయంలో నందినీ రాయ్‌కు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో చక్కని ఆట, క్యూట్ లుక్స్‌తో సందడి చేసిన ఈ బ్యూటీ.. అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో మంచి పేరు కూడా వచ్చింది. ఇక, ఈ షో తర్వాత నందినీకి మరిన్ని అవకాశాలు వస్తాయని అంతా భావించినా వర్కౌట్ మాత్రం కాలేదు.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

అలాంటి పాత్రలతో: చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో హీరోయిన్‌గా సత్తా చాటుతోన్న నందినీ రాయ్‌కు అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్‌లోనే చేస్తోంది. ఈ మధ్య నందినీ 'గాలి వాన' సిరీస్‌తో పాటు 'వారిసు', 'భాగ్ సాలే', CSI Sanatan మూవీలు చేసింది. అలాగే, మరికొన్ని వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

ఫ్యాన్స్‌తో ముచ్చట: అందం, అభినయంతో మెప్పించే టాలెంట్ ఉన్నా నందినీ రాయ్ మాత్రం ఆఫర్లను పెద్దగా అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే తన ఫాలోవర్లను ఓ రేంజ్‌లో అలరిస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

గ్లామర్‌తో కైపెక్కిస్తూ: నందినీ రాయ్ సోషల్ మీడియాలో ఈ మధ్యన డోస్ పెంచేసి మరీ అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా నందినీ రాయ్ తరచూ నెటిజన్లకు మజాను పంచడంతో పాటు నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఈ కారణంగా అయినా ఆమెకు కొన్ని అవకాశాలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు.

Hyderabad Heroine Nandini Rai Awesome Photos Goes Viral

వాటర్‌లో హాట్ షోతో: కొంత కాలంగా సోషల్ మీడియాలో డోసు పెంచేసి హాట్ షో చేస్తోన్న నందినీ రాయ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. వీటిలో ఆమె వాటర్‌లో వైట్ శారీ కట్టుకుని హాట్ షో చేస్తోంది. ముఖ్యంగా క్లీవేజ్‌ను హైలైట్ చేస్తూ కవ్విస్తోంది. ఫలితంగా ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ యమా వైరల్‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X