twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పక్కా ప్లాన్ తోనే నటి మీద లైంగిక దాడి.. సినిమాల్లో పనిచేస్తూనే అలా స్కెచ్.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు!

    |

    హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో జరిగిన చోరీ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒక టాలీవుడ్ నటి మీద దాడి చేసి లైంగిక దాడి కూడా చేయడానికి ప్రయత్నించండంతో అది హాట్ టాపిక్ గా మారుతోంది. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    అతని పేరు ఏంటంటే?

    అతని పేరు ఏంటంటే?

    ఈ విషయం మీద హైదరాబాద్ సీపీ అంజనికుమార్ బషీర్ బాగ్ కార్యాలయంలో మాట్లాడారు. కేబీఆర్ పార్క్ లో సినీ నటి ఛౌరాసియా పై దాడి మొబైల్ పోన్ చోరీ కేసును పోలీసులు చేధించినట్లు వెల్లడించారు. నిందితుడిని మహబూబ్ నగర్ జిల్లా కు కుల్కచర్ల చెందిన కొమ్ము బాబు గా గుర్తించిన పోలీసులు, మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన బాబు.. సినిమా షూటింగ్ లలో సెట్ వర్కర్ గా పని చేస్తున్నట్టు గుర్తించారు. బాబు ప్రస్తుతం ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్నాడని, సెట్ వర్కర్ గా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు.

    డబ్బు చాలక పోవడంతో

    డబ్బు చాలక పోవడంతో

    కేబీఆర్ పార్క్ ఔటర్ ట్రాక్ అడ్డాగా దోపిడీలకు ప్లాన్ చేసిన బాబు, ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం షాలు చౌరాసియా అనే వర్ధమాన నటి పై దాడి చేసి మొబైల్ అపహరించుకుని వెళ్ళాడని గుర్తించారు. నటి షాలు చౌరాసియాపై దాడి,మొబైల్ చోరీకి ముందు కేబీఆర్ పార్క్ లో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడని, ఈ క్రమంలో ఈ నెల 14 వ తేదీన షాలు చౌరాసియా పార్క్ లోకి వాకింగ్ కు వచ్చిందని, అప్పటికే రెక్కీ నిర్వహించిన నిందితుడు బాబు చీకటి ప్రదేశంలోకి రాగానే ఆమెను వెనుక నుండి గట్టిగా పట్టుకుని ఆమె అరవకుండా నోరు మూసాడని పేర్కొన్నారు.

    బండరాయితో కొట్టే ప్రయత్నం

    బండరాయితో కొట్టే ప్రయత్నం

    ఆమె గట్టిగా ప్రతిఘటిస్తున్న సమయంలో ఆమె తలను బండరాయితో కొట్టే ప్రయత్నం చేసాడని, కుదరక పోవడంతో ఆమెపై దాడి చేసి ఐఫోన్ లాక్కెళ్లాడని, చోరీ అనంతరం కేబీఆర్ పార్క్ ఫెన్సింగ్ దాటి బయటకు వెళ్లిపోయాడని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ కేసును ఛేదించడానికి సంయుక్తంగా పని చేశారన్న ఆయన ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం అలస్యమ్ అయిందన్నారు.

    టాస్క్ఫోర్స్ ఓఎస్డీ రాధా కిషన్ మాట్లాడుతూ సమాచారం రాగానే టీం ఫార్మ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసామనీ, ఘటన జరిగిన రోజు ఏ సీసీ కెమెరాల్లో నిందితుడు క్యాప్చర్ అవ్వలేదనీ వెల్లడించారు.

    అలా దొరికాడు

    అలా దొరికాడు

    గత మూడు సంవత్సరాల స్నాచర్స్ డేటా తెప్పించుకుని లిస్ట్ ఔట్ చేసామని, జైల్లో ఉన్నవాళ్ళను ఎలిమినెట్ చేసి.. బయట ఉన్న స్నాచర్స్ ను తీసుకు వచ్చి వారిని విచారించామన్నారు. అలా సుమారు 70 నుండి 80 మంది ని విచారించామని, మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ కు కూడా వెళ్లి విచారించమని అన్నారు. అయితే ఈ కేసులో ఉన్న బాబు పై గోల్కొండలో చోరీ కేసు నమోదు అయిందని, దాని ఆధారంగా కేసును ఛేదించామని అన్నారు.

    కేవలం హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసును ఛేదించామన్న ఆయన. కేవలం 20 శాతం మాత్రం టెక్నీకల్ ఆధారాల మీద ఆధార పడ్డామన్నారు. 50 మంది పోలీసులు 5 రోజులు వర్కౌట్ చేస్తే కేసును ఓ కొలిక్కి తీసుకు రాగాలిగామన్నారు.

    ప్లాన్ చేయలేదు కానీ

    ప్లాన్ చేయలేదు కానీ

    ఆ టైం లో ఎవరు వస్తే వారిని దోపిడీ చేద్దాం అని భావించగా ఆ సమయంలో షాలు వచ్చింది, ఆమెను చోరీ చేసాడని వెల్లడించారు. అయితే తన వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురయ్యానని షాలూ వెల్లడించారు. దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించినట్లు ఆమె వెల్లడించారు. తాను తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడని, ఫోన్‌ పే చేస్తానని చెప్పి డయల్‌ 100కు రెండుసార్లు ఫోన్‌ చేయడం చూసి నా సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడని ఆమె వెల్లడించింది.

     అలా తప్పించుకుంది

    అలా తప్పించుకుంది

    హెల్ప్‌ అంటూ అరుస్తుండగా చేతులు, ముఖంపై దాడి చేసాడు అని, బండరాయిపైకి తోసివేయడంతో నేను స్పృహ తప్పాననీ ఆమె వెల్లడించింది. పొదల్లోకి లాగి నాపై లైంగిక దాడికి యత్నించాడన్న ఆమె అంతలో నాకు స్పృహ రావడంతో అతను బండరాయితో నా ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా మోచేతితో అతని ప్రైవేట్‌ పార్ట్‌పై కొట్టి మెయిన్ రోడ్ వైపు ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు వెళ్ళి ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్‌ అని అరవడంతో దగ్గర్లో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని తెలిపింది. అలా సేవ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

    English summary
    Hyderabad police revealed crucial information about actress Shalu chourasiya KBR park incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X