సెలబ్రెటీనంతే , మీ ప్రాపర్టీని కాదు .. నా మీదకొచ్చేస్తారా.. తాప్సీ పన్నూ షాకింగ్ కామెంట్స్

ఝమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు చేతుల్లో పడటంతో ఆమె తన తొలి చిత్రంతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు. స్మైల్, మెస్మరైజింగ్ లుక్‌, లే లేత అందాలతో డెబ్యూ మూవీతోనే బోల్డెంత పాపులారిటీ వచ్చింది. ఆ వెంటనే ప్రభాస్ , వెంకటేష్, రవితేజ వంటి బడా హీరోలతో నటించే ఛాన్సులు కొట్టేసింది. తర్వాత తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడా బడా స్టార్స్‌ పక్కన హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు ఎందుకో స్టార్ డమ్ దక్కలేదు.

భరతనాట్యం, స్క్వాష్ క్రీడ‌లలో ఎక్స్‌పర్ట్ అయిన తాప్సీ. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గానూ పనిచేశారట. అయితే అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టారట తాప్సీ. సౌత్‌ నుంచి నేరుగా ముంబైలో ల్యాండైన తాప్సీ పన్నూ.. చష్మే బద్దూర్‌తో హిందీలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. అక్కడా పడుతూ లేస్తూ అన్నట్లుగానే ఆమె కెరీర్ సాగింది. మొన్నామధ్య కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ సరసన నటించిన డుంకీతో హిట్ కొట్టారు తాప్సీ. ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి.

I am a public figure not public property says actress Taapsee Pannu video goes viral

డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌తో సుదీర్ఘకాలంగా డేటింగ్‌లో తాప్సీ.. ఈ ఏడాది మార్చిలో అతనితో పెళ్లిపీటలెక్కింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్‌లోని ప్రఖ్యాత ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. అయితే నేటి వరకు వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. మథియాస్ గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్- చిరాగ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. తాము ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటామని, జీవితాంతం కలిసి ఉండగలమని నమ్మకం వచ్చాకే .. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టామని ఆమె తెలిపారు.

అయితే తాప్సీకి అందంతో పాటు ముక్కుసూటితనం, కాస్త కోపం కూడా ఎక్కువే. ఈ విషయంపై అయినా నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఆమె వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం అక్షయ్ కుమార్‌తో నటించిన ఖేల్ ఖేల్ మే .. ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగా తాప్సీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. వేదికపైకి వచ్చిన అనన్య ద్వివేది అనే ఓ యువతి తాప్సీ వద్దకు వెళ్లి సెల్ఫీ కోరగా.. ఆమె నిరాకరించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఏకీ పారేశారు.

ఇది సద్దుమణిగిందో లేదో తాప్సీ పన్నూ మరో వివాదాన్ని రేపారు. ఓ జాతీయ ఛానెల్ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో ఫోటోగ్రాఫర్లపై నోరుపారేసుకుంది. తాను సెలబ్రిటీనని.. అంతే తప్పించి పబ్లిక్ ప్రాపర్టీని కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెమెరాలు పట్టుకుని నా మీదకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం ఏంటీ.. ముందు నేనో ఆడపిల్లని, ఆ తర్వాతే నటినని తాప్సీ పేర్కొన్నారు. ఇది గుర్తుపెట్టుకుని తనకు ఇబ్బంది కలిగించవద్దని.. ఇలా చెబితే , సినిమాలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నిస్తారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రస్తుతం తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె మాటలపై ఫోటోగ్రాఫర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X