ఐశ్వర్య రాయ్‌లా ఉంటే నన్ను ఏంచేయమంటారు?
ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్ ,సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన బ్యూటీ స్నేహా ఉల్లాల్. కొంచెం అటు ఇటుగా ఐశ్వర్యరాయ్ ను పోలి ఉండే స్నేహ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వయ్యారి సినిమాలు లేక ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో హాట్ హాట్ ఫోటోలతో హల్ చల్ చేస్తోంది. మితిమీరి అందాలు ఆరబోసిన అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి రావట్లేదు. అటు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు కరువవ్వడంతో స్నేహ పని అయిపోయినట్టే అని అందరూ భావించారు.
ఈ నేపథ్యంలో ఈ బ్యూటీ ఎక్స్పైరీ డేట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఈ చిన్నదాన్ని కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఐష్ పోలికలతో ఉన్న ఈ భామ అక్కడ కొన్ని ఆఫర్లు దక్కించుకుంది. అయితే తనను ఐశ్వర్య రాయ్ తో పోల్చడం పై స్నేహ ఉల్లాల్ స్పందించింది. తనను ఐష్ లా ఉన్నావ్ అనడం పై అసహనం వ్యక్తం చేసింది. ప్రతిసారి ఐష్ తో ఆమెను పోల్చడం తో ఈ అమ్మడికి చిర్రెత్తుకొచ్చింది . "ఐశ్వర్య రాయ్ వర్క్ , ఆమె సాదించిన విజయాలు నాకు ఆదర్శం.

కానీ ఐష్ తో నన్ను పోల్చడం నాకు ఇష్టముండదు. నాకంటూ ఓ గుర్తింపు ఉంది. కానీ నేను ఆమెలా ఉంటే నన్ను ఏంచేయమంటారు .? అందుకోసం నేను నా లుక్ ను మార్చుకోలేను కదా ..? అని ప్రశ్నిస్తుంది. ఒక ఫంక్షన్ లో నేను ఐశ్వర్య రాయ్ ని కలిసాను ఆమె నన్నుమర్యాదగా పలకరించింది. నాకు చాలా సంతోషంగా అనిపించిందని స్నేహా ఉల్లాల్ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











