నన్ను మీరేం చేయలేరు: పెళ్లి విషయంలో ఆ వార్తలపై వరలక్ష్మి ఫైర్
తమిళ నటి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి పెళ్లి ఎప్పుడూ హాట్ టాపికే. విశాల్ స్నేహితురాలు కావడంతో గతంలో ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. తాజాగా మరోసారి వర లక్ష్మి పెళ్లి విషయంలో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
తన పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లపై ఈ సారి వరలక్ష్మి ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 'నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. నాకు ఎంగేజ్మెంట్ జరుగ లేదు, పెళ్లి చేసుకోవడం లేదు' అని వరలక్ష్మి స్పష్టం చేశారు.
నా గురించి వార్తలు స్ప్రెడ్ చేస్తున్న వారికి పనీ పాట లేదేమో? నాపై ఈ ఆధారం లేని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. నన్ను తొక్కేయాలనే ఉద్దేశ్యంతోనే ఇలాంటివి చేస్తున్నారు. మీరు నన్ను ఏమీ చేయలేరు. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. నా హార్డ్ వర్క్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు... అంటూ వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

వరలక్ష్మి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.... ఆమె విశాల్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం తెలుగులో 'పందం కోండి 2' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











