Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
చాలా మందితో ప్రేమలో, ఫిజికల్‌గా కూడా: హీరోయిన్ సంచలన కామెంట్
'రక్త చరిత్ర' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాధిక ఆప్టే.. తర్వాత బాలయ్యతో కలిసి లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించింది. ఎప్పుడూ ఏదో ఒక హాట్ కామెంటుతో వార్తల్లో ఉండే ఈ బ్యూటీకి పెళ్లయిన విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె లండన్ బేస్డర్ మ్యూజీషియన్ బెనడిక్ట్ టేలర్‌ను 2012లో పెళ్లాడారు. అతడు అక్కడ, ఈమె ఇక్కడ ఉంటూనే అప్పుడప్పుడూ కలుసుకుంటూ వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక మనిషి చాలా మందితో ప్రేమలో పడతారనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను అని వ్యాఖ్యానించారు.
అనే విషయాన్ని నమ్ముతాను
నేహా ధూపియా చాట్ షో బిఎఫ్ఎఫ్స్ విత్ వోగ్-సీజన్ 3లో ఆమె మాట్లాడుతూ... ‘మనం చాలా మందితో ప్రేమలో పడతాం అనే విషయాన్ని నమ్ముతాను. నేను చాలా మందిని ప్రేమించాను, వివిధ సందర్బాల్లో వివిధ రకాలుగా ప్రేమలో పడ్డాను. డాన్సింగ్, యాక్టింగ్ లాంటి వాటిని నేను ఎలా లవ్ చేస్తానో.... అలాగే నిన్ను కూడా ఎందుకు లవ్ చేయకూడదు? ‘అయ్యో... ఎందుకు ఇలా జరుగుతుంది అని' నాకు నేనుగా పనిష్ చేసుకోను అంటూ రాధిక ఆప్టే వ్యాఖ్యానించారు.
కొన్ని సార్లు అది ఫిజికల్ ఎట్రాక్షన్ అయుండొచ్చు
జీవితంలో మనం ఎంతో మందిని కలుస్తాం. అందులో చాలా మంది వండర్ఫుల్ పీపుల్ ఉంటారు. వారిని చూసి కొన్ని సందర్భాల్లో టెమ్ట్ అవుతాం. కొన్ని సార్లు అది ఫిజికల్ ఎట్రాక్షన్ అయుండొచ్చు, కొన్ని సార్లు వారంటే మామూలు ఇష్టం ఉండొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతాయి... అని రాధిక ఆప్టే వెల్లడించారు.
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న రాధిక ఆప్టే
రాధిక ఆప్టే, బెనడిక్ట్ టేలర్ 8 సంవత్సరాల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. తక్కువ కాలంలోనే గాఢమైన ప్రేమలో మునిగిన ఈ జంట వెంటనే పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
నెలలో ఒకసారి తప్పకుండా కలుస్తారట
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ... కొన్నిసార్లు నేను లండన్ వెళతాను, కొన్ని సార్లు నా భర్త నన్ను కలవడానికి ఇండియా వస్తారు. ప్రతి నెలలో మేము తప్పకుండా కొన్ని రోజులు కలిసి గడుపుతాం. ఈ విషయంలో చాలా కమిట్మెంటుతో ఉంటాం. కొన్నిసార్లు ఇద్దరికీ ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటే రద్దు చేసుకుంటామని వెల్లడించారు.