జయలలిత బయోపిక్.. నేను రెడీ అంటున్న త్రిష!
చెన్నై సుందరి త్రిష నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మోహిని డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాకా త్రిష లేడి ఓరియెంటెడ్ చిత్రపై దృష్టి పెట్టింది. ఆ క్రమంలో త్రిష తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కించాలని ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి.
జయలలితగా నటించే అవకాశం వస్తే వదులుకునే హీరోయిన్లు ఉండరు. అందుకేనేమో ఈ చిత్రంపై త్రిష కాస్త ముందుగా స్పందించింది. జయలలిత పాత్రలో నటించాలని ఉందని తన కోరిక బయట పెట్టింది. చిన్న నాటినుంచి జయలలితని చూస్తూ పెరిగాను. ఆమె ప్రభావం నాపై చాలా ఉంది అని త్రిష తెలిపింది.

ప్రస్తుతం సౌత్ లో బయోపిక్ చిత్రాల ట్రెండ్ సాగుతోంది. మహానటి విజయం సాధించగా ఎన్టీఆర్, ఉయ్యాలవాడనరసింహ రెడ్డి బయోపిక్ లు సిద్ధం అవుతున్నాయి. జయలలిత బయోపిక్ ప్రారంభమైతే జాతీయ వ్యాప్తంగా అందరిలో ఈ చిత్రంపై ఉత్కంఠ నెలకొని ఉంటుంది.


Click it and Unblock the Notifications